అగైనెస్ట్ అవుట్రేజ్ పేరుతో పుస్త‌కం – రాస్తున్న ప్రియాంక గాంధీ

రిలీజ్ కాకుండానే రికార్డ్‌లు బ్రేక్ చేస్తోంది .అగైనెస్ట్ అవుట్రేజ్ పుస్త‌కం. దేనికైనా పెట్టి పుట్టుండాలి. అదృష్టం అంటే ఇదేనేమో. ఇప్ప‌టికే కోటి రూపాయ‌లు కూడా ఓ అంత‌ర్జాతీయ పుస్త‌క ప్ర‌చుర‌ణ సంస్థ ఇచ్చిన‌ట్టు వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇంత‌కీ ఆ పుస్త‌కం ఏమిట‌ని అనుకుంటున్నారా.రాస్తున్న‌ది ఎవ‌రో కాదు.ఐర‌న్ లేడీగా పేరొందిన ఇందిరా గాంధీ ముద్దుల మ‌నుమ‌రాలు.రాజీవ్, సోనియా గాంధీల ఒకే ఒక్క కూతురు.దేశానికే యూత్ ఐకాన్‌గా పేరున్న ప్రియాంక గాంధీ. దీంతో ఒక్క‌సారిగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉత్సుక‌త‌.ఉత్కంఠ పెరిగింది. ఇంత‌కూ ఆ పుస్త‌కంలో ఏం ఉండ‌బోతోంది.ఏయే అంశాల‌ను ప్ర‌స్తావించ‌నున్నారు.

priyanka gandhi

ఇది త‌న ఆత్మ‌క‌థ‌నా లేక స‌మ‌కాలీన‌ రాజ‌కీయ అంశాలు, వ్య‌వ‌హారాల‌పై ఏమైనా కామెంట్స్ చేయ‌బోతున్నారా.లేక తాను .త‌న ఇన్న‌ర్ ఫీలింగ్స్‌ను చెప్ప‌బోతున్నారా.లేదా ఈ దేశానికి దిశా నిర్దేశం చేసేలా యువ‌తీ యువ‌కుల‌కు, మ‌హిళ‌ల‌కు ఏమైనా సందేశాలు ఇవ్వ‌నున్నారా అన్న‌ది ఇండియా వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ దేశంలో అత్యున్న‌త‌మైన ఎన్న‌ద‌గిన యువ నేత‌ల్లో ప్రియాంక గాంధీ ముందు వ‌రుస‌లో నిలుస్తారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కురాల‌ల్లో ఆమె టాప్ వ‌న్‌గా ఉన్నారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలలోని ప‌ట్టుద‌ల‌, రాజీవ్ గాంధీలోని మాన‌వ‌త్వం, సోనియాగాంధీ లోని మెత‌క‌ద‌నం.రాహుల్ గాంధీలోని చురుకుద‌నం క‌లిపితే ప్రియాంక గాంధీ అవుతారు. ఆమెను వాళ్ల నాయ‌న‌మ్మ ఇందిరాగాంధీతో పోలుస్తున్నారు. ఇప్ప‌టికే ఏఐసీసీ పెద్ద‌లు, నాయ‌కులు, ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధ్య‌క్షులు ఇలా ప్ర‌తి ఒక్క‌రు ప్రియాంక గాంధీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరుతున్న వారే.

కానీ ఆమె ఏరోజూ పాలిటిక్స్ గురించి ప్ర‌త్య‌క్షంగా మాట్లాడ‌లేదు. ఏది మాట్లాడినా స్ప‌ష్టంగా ఉంటుంది. ప‌ద్ధ‌తి ప్ర‌కారంగా .కేవ‌లం స‌బ్జెక్టు గురించి మాత్ర‌మే మాట్లాడ‌తారు. ప‌రిణ‌తి చెందిన వ్య‌క్తిగా.నాయ‌కురాలిగా.ఆమె ఎదిగారు. ప్ర‌పంచంలోని యూత్‌కు ఆమె ఓ అందివ‌చ్చిన భ‌విష్య‌త్ నాయ‌కురాలిగా పేరొందారు. ఆర్థిక‌, సామాజిక‌, రాజ‌కీయ‌, సాంస్కృతిక , మేనేజ్‌మెంట్ రంగాల‌పై ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అతి త‌క్కువ కాలంలోనే ప‌రిణ‌తి క‌లిగిన నాయ‌కురాలిగా ప్రియాంక గాంధీ ఎదిగారు. త‌న‌ను తాను ప్రాధాన్య‌త క‌లిగిన‌.విస్మ‌రించ‌లేని వ్య‌వ‌స్థ‌గా మారారు. ఇది గాంధీ కుటుంబానికి ఓ ర‌కంగా మేలు చేకూరింద‌నే చెప్పాలి. ఛ‌రిస్మా క‌లిగిన లీడ‌ర్‌గా ఇపుడు ఆమెను పేర్కొంటున్నారు. రాబోయే 2019 ఎన్నిక‌ల్లో ప్రియాంక కీల‌క‌మైన నాయ‌కురాలి హోదాలో దేశ‌మంత‌టా ప‌ర్య‌టించేందుకు ఇప్ప‌టి నుండే థింక్ టీం యోచిస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఆమె రావ‌డం .ప్ర‌చారం చేయ‌డం.పార్టీకి అద‌న‌పు బ‌లం చేకూర్చిన‌ట్ట‌వుతుంది. అన్నా చెల్లెల్లు ఇద్ద‌రికి ఒక‌రంటే మ‌రొక‌రికి ప్రాణం. రాహుల్ గాంధీ మెల మెల్ల‌గా పార్టీపై ప‌ట్టు సాధిస్తున్నారు. స‌మ‌స్య‌ల‌ను అవ‌గాహ‌న చేసుకుంటున్నారు.

దేశంలో కాంగ్రెస్ పాల‌న తీసుకు వ‌చ్చేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌ల్లి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూనే తండ్రి చాటు బిడ్డ అనే అప‌వాదు నుండి బ‌య‌ట ప‌డ్డారు. విస్తృతంగా ప‌ర్య‌టిస్తూనే భావ సారూప్య‌త క‌లిగిన నాయ‌కులు, పార్టీలు, సంస్థ‌లు, ప్ర‌జా స్వామిక వాదుల‌తో భేటీ అవుతున్నారు. ఈ దేశం కోసం తామేం చేయ‌గ‌ల‌మో రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేస్తున్నారు. ఆయ‌న హ‌యాంలో మూడు చోట్ల తిరిగి కాంగ్రెస్ పార్టీ త‌న జెండాను ఎగుర వేసింది. ఇది రాహుల్ మార్క్‌ను స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి సారి జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ప్రియాంక గాంధీ రాహుల్‌, సోనియా గాంధీల కోసం ప్ర‌చారం చేస్తూ వ‌చ్చారు. భారీ మెజారిటీని అందించారు. రాబోయే ఎన్నిక‌ల్లో స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఆమె ఉండ‌బోతుద‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. అగైనెస్ట్ అవుట్రేజ్ – పేరుతో రాయ‌బోతున్న ఈ పుస్త‌కంపైనే దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆమె ఏం రాస్తారోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. ప‌బ్లిష‌ర్స్ త‌మ‌కు ప్ర‌చురించే అవ‌కాశం ఇవ్వ‌మ‌ని క్యూ క‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇంట‌ర్నేష‌నల్ గా పేరొందిన ప‌బ్లిషింగ్ కంపెనీకి అప్ప‌గించార‌ని.ఇందు కోసం కోటి రూపాయ‌లు ఆ సంస్థ ముంద‌స్తుగా చెల్లించిన‌ట్లు వార్త‌లున్నాయి. దీనిని ప్రియాంక గాంధీ ఖండించ‌లేదు. కానీ పుస్త‌కానికి పేరు ఆల్రెడీ పెట్ట‌డం కూడా జ‌రిగి పోయింది. వ‌చ్చే మార్చిలో లేదా ఏప్రిల్‌లో ఈ పుస్త‌కాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్న‌ట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్‌లోనే కాకుండా ఇండియాలోని అన్ని భాష‌ల్లోకి అనువాదం ఉంటుంద‌ని.ఇందు కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం .

అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాలు, ప‌లు భాష‌ల‌పై ప‌ట్టు , స‌బ్జెక్టుపై సాధికార‌త‌, లైఫ్‌పై ప‌ట్టు క‌లిగిన నాయ‌కురాలిగా త‌న‌ను తాను ప్రియాంక గాంధీ మ‌ల్చుకున్నారు. మోస్ట్ ఫేవ‌ర‌బుల్ ప‌ర్స‌నాలిటీగా త‌క్కువ వ్య‌వ‌ధిలో సంపాదించుకోగ‌లిగారు. సూటిగా.స్ప‌ష్టంగా.ఇందిర మాట్లాడిన‌ట్టే ఉంటుంది ఆమె వ్య‌వ‌హార శైలి కూడా. రిలీజ్ కాకుండానే రికార్డులు సృష్టిస్తున్న అగైనెస్ట్ అవుట్రేజ్ పుస్త‌కం రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు బ్ర‌ద్ద‌లు కొడుతుంద‌నేది అంచ‌నాల‌కు అంద‌డం లేదు. 1972 జ‌న‌వ‌రి 12న జ‌న్మించిన ప్రియాంక గాంధీకి ఇపుడు 42 ఏళ్లు. రాబ‌ర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్న ఆమె చాలా రిజ‌ర్వ్‌డ్‌గా ఉంటారు.

పాలిటిక్స్ ప‌ట్ల అంత శ్ర‌ద్ధ ఉన్న‌ట్లు క‌నిపించ‌దు కానీ .న‌ర్మ‌గ‌ర్భంగా స్పందిస్తారు. త‌ల్లి, అన్న ల విజ‌యం కోసం ప్ర‌చారంలో పాల్గొంటారు. ప్ర‌జ‌ల‌తో క‌లిసి పోవ‌డానికి ఇష్ట ప‌డ‌తారు. అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తారు. గెలిచాక .ప్ర‌జ‌ల‌తో తిరిగి స‌మావేశ‌మ‌వుతారు. కృత‌జ్ఞ‌త‌లు తెలిపి.త‌న ప‌నిలో .కుటుంబ బాధ్య‌త‌లు చూసుకుంటారు. ఇదంతా ఆమె రోజూ లైఫ్ స్ల‌యిల్. కాట‌న్ శారీస్ .ధ‌రించ‌డం.సూటిగా.ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడ‌టం ఆమెకే చెల్లింది. ఇండియా, ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా సంస్థ‌ల‌న్నీ ప్రియాంక గాంధీ కోసం వేచి ఉంటాయి. ఇంట‌ర్వ్యూల కోసం ఎగ‌బ‌డ‌తాయి. వాట‌న్నింటిని ఆమె న‌వ్వుతూ తిర‌స్క‌రిస్తారు. ఐ యామ్ నాటే ఏ పొలిటిషియ‌న్.బ‌ట్.ఐ యామ్ ఏ లెర్న‌ర్ అంటారు ఓ సంద‌ర్భంలో. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత అన్నా , చెల్లెల్లు కుటుంబానికి దూరంగా ఉన్నారు. చ‌దువుపై శ్ర‌ద్ధ పెట్టారు. త‌ల్లి ఆశ‌యాల‌కు అనుగుణంగా త‌మ‌ను తాము అప్ డేట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

ఓ ర‌కంగా వారు యూత్ ఐకాన్స్‌గా మారారు. ఇది భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు .కాంగ్రెస్ పార్టీకి శుభ ప‌రిణామం. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాలి.ఇదే నేనూ చేస్తున్నాన‌ని బీబీసీ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. ప్రియాంక గాంధీ ప‌రిణ‌తి క‌లిగిన మ‌హిళ‌. అతి త‌క్కువ కాలంలోనే త‌న‌దైన ముద్ర‌ను ఏర్పాటు చేసుకున్నారు. భ‌విష్య‌త్‌లో భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గిన నాయ‌కురాలిగా ఎదిగే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఆమె ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరుకుందాం. ఈ దేశం ఆమె కోసం ఎదురు చూస్తోంది. !

Comments

comments

Share this post

scroll to top