34 సంవ‌త్స‌రాల కెరీర్‌లో 71 సార్లు బ‌దిలీ అయిన నిజాయితీ ఉన్న ఐఏఎస్ ఆఫీస‌ర్ ఈయ‌న తెలుసా..?

మ‌న దేశంలో నీతి, నిజాయితీల‌తో ప‌నిచేసే అధికారులు అంటే అంతే.. రాజ‌కీయ నాయ‌కుల‌కు వారు ఎప్పుడూ కంటగింపుగా ఉంటారు. త‌మకు అనుకూలంగా ప‌నిచేస్తే స‌రి. లేదంటే వారిని బ‌దిలీ చేస్తారు. ఇక కొంద‌రు నేతలు అయితే నీతివంత‌మైన ఆఫీస‌ర్ల‌ను ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌రు. అలా ఉంది నేడు మ‌న దేశంలో ప‌రిస్థితి. ఇందుకు ఏ ఒక్క రాజ‌కీయ నాయ‌కుడు మిన‌హాయింపు కాదు. అలాంటి నేత‌ల బారిన ప‌డి ఆ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఏకంగా త‌న 34 సంవ‌త్స‌రాల కెరీర్‌లో 71 సార్లు బ‌దిలీ అయ్యాడు. అయితే త‌న ప‌ద‌వీ కాలం చివ‌రి ఆరు నెల‌ల‌కు గాను అత‌నికి జీతం అంద‌నేలేదు. షాకింగ్‌గా ఉన్న ఇది నిజ‌మే.

ఆయ‌న పేరు ప్ర‌దీప్ క‌స్ని. 1984 హరియాణా సివిల్ స‌ర్వీసెస్ బ్యాచ్‌కు చెందిన ఈయ‌న 34 సంవ‌త్స‌రాలు నిరాటంకంగా, నీతి, నిజాయితీల‌తో సేవ‌లు అందించారు. దీంతో త‌న ప‌ద‌వీ కాలంలో 71 సార్లు బ‌దిలీ అయ్యారు. అంత‌లా నిజాయితీతో ప‌నిచేస్తారు క‌నుక‌నే ఈయ‌న్ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం చాలా సార్లు బ‌దిలీ చేసింది. ఇక బీజేపీ ప్ర‌భుత్వం కూడా ఈయ‌న్ను బ‌దిలీలు చేసింది. అయితే ఈయ‌న ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన రిటైర్ అయ్యారు. కానీ తాను రిటైర్ అయ్యే నాటికి 6 నెల‌ల పాటు హ‌రియాణా ల్యాండ్ యూస్ బోర్డులో ఓఎస్‌డీగా ప‌నిచేశారు. అయితే ఆ 6 నెల‌ల‌కు గాను ఈయ‌న‌కు జీతం అంద‌లేదు. ఎందుకంటే…

హ‌రియాణాలో అస‌లు ఆ బోర్డు అనేది ఒక‌టి లేనేలేద‌ట‌. ఈ విష‌యం ప్ర‌దీప్‌కు ఎలా తెలిసిందంటే… ఈయ‌న ఈ బోర్డుకు బ‌దిలీ కాగానే సంబంధిత శాఖకు చెందిన డాక్యుమెంట్లు అవీ అడిగార‌ట‌. కానీ అస‌లు అలాంటి డాక్యుమెంట్లు కానీ, ఆ బోర్డులో పనిచేసే ఉద్యోగులు కానీ ఎవ‌రూ లేర‌ని తెలిసింది. దీంతో ఈ విష‌యంపై ఆయ‌న ప్ర‌భుత్వాన్ని నిల‌దీయగా నేత‌లు స‌మాధానం చెప్ప‌లేదు. చివ‌ర‌కు ఆర్‌టీఐని ఆశ్ర‌యించ‌డంతో అస‌లు విష‌యం తెలిసింది. స‌ద‌రు బోర్డు అనేది అస‌లు ఆ రాష్ట్రంలో లేద‌ని, ఒకప్పుడు ఉన్నా ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆ బోర్డును తీసేశార‌ని తెలిసింది. దీంతోనే త‌న‌కు 6 నెల‌ల జీతం రాలేద‌ని గుర్తించిన ప్ర‌దీప్ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్ ను ఆశ్ర‌యించారు. అందులో కేసు న‌డుస్తోంది. త్వ‌రలో తీర్పు వ‌స్తుంది. ఇక ప్ర‌దీప్ భార్య కూడా ఐఏఎస్‌ అధికారిణి. ఆమె గతంలో గవర్నర్‌కు ఏడీసీ పనిచేసి గతేడాది పదవీ విరమణ చేశారు. ఏది ఏమైనా కానీ తనకు 6 నెలల జీతం వ‌చ్చే వ‌ర‌కు పోరాటం ఆగదని ప్ర‌దీప్ చెబుతున్నారు. ఆయ‌న‌కు న్యాయం జ‌ర‌గాల‌ని మ‌న‌మూ కోరుకుందాం..!

https://thelogicalindian.com/news/pradeep-kasni-retires/

Comments

comments

Share this post

scroll to top