భారత్ చేసిన మేలును తలచి 100 మీటర్ల భారత జండాతో పరుగులు పెట్టిన ఆప్ఘాన్ పౌరులు..

ఎక్కడ నుండి ఏ బాంబులు పేలుతున్నాయో తెలియని ప్రాంతమది .  ఉన్నట్టుండే  స్కూటర్ బాంబు లు బ్లాస్ట్ అవుతాయ్, కళ్లముందే   మానవ బాంబులు  పేలిపోతాయ్… ఇది అక్కడ నిత్య కృత్యం. అయితేనేం.. వాళ్లు మనుషులే, వాళ్లకూ కృతజ్ఙత ఉంటుంది. ఇదే నిరూపించబడింది అప్ఘనిస్థాన్ లో.

అది అఫ్ఘనిస్థాన్ లోని ..  సల్మా డ్యామ్ ప్రాంతం… ఆఫ్ఘాన్ యువకులు  గుంపులు గుంపులుగా వస్తున్నారు. అందరూ గుమ్మిగూడాక,  100 మీటర్ల పొడవున్న మన భారత దేశ త్రివర్ణ పతాకాన్ని చేత బట్టి  పరుగులు పెట్టారు… జై ఇండియా.. జైఇండియా  అంటూ నినాదాలు కూడా చేశారు.

అప్ఘాన్ పౌరులేంటి మనదేశానికి జై కొట్టడం ఏంటి అనేగా సందేహం.. అది మనదేశం పట్ల వాళ్లకున్న కృతజ్ఙత అది…ఎందుకంటే  2006 లో  అప్ఘనిస్థాన్ లో కూలిపోయిన  సల్మా   డ్యామ్ పునర్ధుద్దరణ కు మన దేశం 300 మిలియన్ల డాలర్ల సహాయం చేసింది. అంటే దాదాపు 195 వేల కోట్ల రూపాయలన్న మాట. దీనికి కృతజ్ఙత గానే వాళ్లు మన జాతీయ జెండా తో అప్ఘాన్ వీదుల్లో అలా పరుగులు తీశారు.

afghan

 

ఇప్పుడు ఈ డ్యామ్  80 వేల హెక్టార్ల  పంట నీటి అవసరాలను తీరుస్తూ రైతలు జీవితాలు బాగుపడేలా చేసింది. , 42 మెగావాట్ల విద్యుత్  ఉత్పత్తికి ఉపయోగపడుతూ  అఫ్ఘనిస్థాన్ ప్రజల ఇంట్లోనే కాదు జీవితాల్లో కూడా వెలుగులు నింపుతోంది.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top