చూడడానికి సాధారణ యువకుడే… కానీ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకే సవాల్ విసిరాడు. ఇతను రేజ్ చేసిన అంశాల్లో లాజిక్ మాత్రం త్రివిక్రమ్ సినిమాల్లోలాగా పుష్కలంగా ఉంది. గ్యాస్ వదులుకోండి అంటూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సలహలు ఉదాహరణలతో సహా సూచించాడు ఈ యువకుడు.
సబ్సీడి లు వదులుకోవడం ఫస్ట్ పదవిలో ఉన్న పొలిటీషియన్స్ నుండి స్టార్ట్ చేయాలని సూచించాడు భాను కిరణ్. పార్లమెంట్ లో విందు భోజనాన్ని సబ్సీడి రేట్లకే తింటూ, ఇతరులను సబ్సీడి వదులుకోండి అంటే ఎలా.. ఫస్ట్ మనం చేసి తర్వాత ఇతరులకు చెప్పాలన్నాడు కిరణ్ తాను చేసిన వీడియో లో…
ఆర్థికంగా ఉన్న వారు సబ్సీడిని తమంతట తామే రద్దు చేసుకోవడం మంచిదే… కానీ ఆర్థికంగా స్థిరంగా ఉన్న పొలిటీషియన్స్ కు కూడా ప్రభుత్వం కల్పించే అలవెన్సులు అవసరమా అనేది ఇక్కడ పాయింట్…
కిరణ్ రేజ్ చేసిన మరిన్ని అంశాలకు సంబంధించిన వీడియో: