ఆధార్ డెడ్ లైన్స్ ఇవే.. పాన్, ఫోన్ ,బ్యాంక్, స్కీమ్స్ అన్నింటికీ లాస్ట్ డేట్స్ ఇవే.!!

అన్నింటికీ ఆధారే ఆధారం అన్నట్లుంది మన పరిస్థితి..రేషన్ తీసుకోవాలంటే ఆధార్,గ్యాస్ కావాలంటే ఆధార్,ప్రయాణం చేయాలంటే ఆధార్ ప్రతి దానికి ఆధార్ కార్డే ఆధారం అయింది..కేంద్రం కూడా అదేవిధంగా ముందుకు సాగుతోంది .. సంక్షేమ పథకాలు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు ఇలా అన్నింటికి ఆధార్ అనుసంధానం చేయాలని చూస్తోన్న కేంద్రం ఇప్పుడు సిమ్ కార్డులపై కూడా ఫోకస్ పెట్టింది..ఆధార్ పై నాలుగు డెడ్ లైన్లను కేంద్రం ప్రకటించింది..వేటితో ఆధార్ ను అనుసంధానం చేయాలి.అది ఎప్పటిలోగా చేసుకోవాలి తెలుసుకోండి.

 

  • ఆధార్ – పాన్ లింక్ :  డిసెంబర్ 31,2017 తేది లోపు ఆధార్ నంబర్ తో పాన్ కార్డ్ కి లింక్ చేయకపోతే,ఆ తర్వాత ఐటి రిటర్న్స్ దాఖలు కావు.
  • ఆధార్– బ్యాంక్ ఖతా లింక్ :  దీనికి కూడా డిసెంబర్ 31.2017 డెడ్ లైన్ గా ప్రకటించారు.ఇప్పటికే చాలామంది బ్యాంక్ ఖాతలతో ఆధార్ ను అనుసంధానం చేసారు.చేయని వారు గడువులోపు చేయించుకోవాలి.లేదంటే బ్యాంక్ ఖాతాలు చెల్లవు.
  • ఆధార్– కేంద్ర సంక్షేమ పథకాల లింక్ : సంక్షేమ పథకాలతో ఆధార్ ను అనుసంధానం చేయడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 31,2017..పెన్షన్ ,గ్యాస్ సబ్సిడి,స్కాలర్ షిప్ లు లభించాలంటే గడువు లోపు ఆధార్ నంబర్ తో అనుసంధానం కావాలి.
  • ఆధార్ -సిమ్ నంబరు: అనుసంధానానికి చివరితేదీ ఫిబ్రవరీ18,2018..ఫిబ్రవరి లోపు మీ సిమ్ నంబరును ఆధార్ తో లింక్ చేయించాలి..లేదంటే ఆ తర్వాత మీ మ్ కార్డులు పనిచేయవు.

Comments

comments

Share this post

scroll to top