ఈ రోజుల్లో … కేవలం ప్రేమ అంటే చూసే కళ్లకే కాదు,చూడలేని మనసుకు కూడా నచ్చాలని చాటి చెప్పింది ఓ జంట.ఆదర్శ ప్రేమ వివాహం..

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతడు ఒక కుటుంబాన్ని కోరుకున్నాడు. ఆ సమయంలోనే తనకు ఒక సంబంధం వచ్చింది. వెంటనే కాదనకుండా పెళ్లికి ఓకే చెప్పేసాడు. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా… కానీ ఇక్కడ జరిగింది ఆదర్శ వివాహం… మరుగుజ్జు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి ఒక జీవితాన్ని అందించాడు.


సిద్ధిపేట్ కు చెందిన విద్యసాగర్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. తాను పెళ్లి చేసుకుంటే ఒక పెద్ద కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో విద్యాసాగర్ కు సికింద్రాబాద్ కి చెందిన రవళి అనే అమ్మాయి సంబంధం వచ్చింది. కానీ ఆ అమ్మాయి మరుగుజ్జు. రవళి హైదరాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజిలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. అమ్మాయి కూడా చదువుకున్నదే అవడంతో విద్యాసాగర్ పెళ్లికి అంగీకరించాడు. పైగా ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో కుటుంబ సభ్యులు దగ్గరుండి ఈ ఆదర్శ వివాహాన్ని జరిపించారు. గురువారం రాత్రి ముషీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ వీరి వివాహానికి వేదికైంది.

Comments

comments

Share this post

scroll to top