ఆదర్శ్…ఇంత ఓవర్ అవసరమా నీకు..? డ్రగ్స్ తీసుకున్నట్టు, ధన్రాజ్ ని కొరికేసి…అందరిని భయపెట్టి!

తెలుగు టెలివిజన్ చరిత్రలో తొలిసారిగా ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్ బాస్ షో’ ఇటీవల ప్రారంభమై టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతుంది. తొలిరోజు బిగ్ బాస్ షో హౌస్‌లోకి 14 మంది ఎంట్రీ ఇవ్వగా సెలబ్రిటీల పరిచయాలతో సందడిగా మారింది. ఇక మూడో ఎపిసోడ్‌లో ఓ కొత్త టాస్క్‌ను ఫేస్ చేశారు బిగ్ బాస్ కుటుంబ సభ్యులు.

>>> CLICK HERE FOR TROLLS ON SAMEER IN BIGBOSS<<<

తమతో తెచ్చుకున్న లగేజ్‌లో ఎన్నైతే ఒంటిపై ధరించగలరో అన్నే ధరించి మిగతా వాటిని సూట్ కేస్‌పెట్టి బిగ్ బాస్ స్టోర్ రూమ్‌లో పెట్టాలన్న బిగ్ బాస్ టాస్క్‌ను కుటుంబ సభ్యులకు చదివి వినిపించింది హరితేజ. అయితే ఈ టాస్క్‌లో కెప్టెన్ సంపూర్ణేష్ బాబుకి మినహా యింపు ఇచ్చారు. అయితే తిరిగి వారి సూట్ కేస్‌లను తిరిగి పొందడానికి లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ని కూడా బిగ్ బాస్ ఇచ్చారు. ఒక హోమాన్ని పెట్టి ఆ హోమం నిర్విరామంగా మండేట్టు ఆరకుండా చూసుకోవాలని తిరిగి సైరెన్ మోగేంత వరకూ హోమం ఆరకూడదనేది ఈ టాస్క్‌లో నిబంధన.

>>> CLICK HERE FOR TROLLS ON ADARSH, DHANRAJ IN BIGBOSS<<<

మరోవైపు ముమైత్ ఖాన్ స్ట్రాంగ్ హగ్‌కి ధనరాజ్ ఫుల్ ఫిదాకాగా.. బిగ్ బాస్ హౌస్‌లో అందమైన అమ్మాయి లేదంటూ అందరూ ఆంటీలే ఉన్నారంటూ హీరో ప్రిన్స్ మనసులో మాటను బయటపెట్టేశాడు. ఒకర్నైనా నా ఏజ్ అమ్మాయ్ లేకపోవడం చాలా బోర్‌గా ఉందని.. తనకోసం తన ఏజ్ గ్రూప్ అమ్మాయిని పంపమంటూ బిగ్ బాస్‌‌కి విన్నవించుకున్నాడు. ఇక ఆదర్శ్ తన ఓవర్ యాక్టింగ్‌తో బిగ్ బాస్ షో హౌస్‌లో ఉన్నవారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఏదో డ్రగ్స్ తీసుకున్నాడా వాడిలాగా ప్రవర్తించాడు. అందరిని కంగారుపెట్టాడు. ధన్రాజ్ ను కొరికాడు. తర్వాత ఏమైంది అని అడిగాడు. ఏదో నటన ప్రావీణ్యం చూపించాలి అనుకున్నాడు అనుకుంటా. కానీ అది ఓవర్ యాక్టింగ్ లాగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ వీడియో మీరు కూడా ఒక లుక్ వేయండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top