పల్లె పాటల కోకిలకు జన్మదిన శుభాకాంక్షలు.మధు గురించి మీకు తెలియని కొన్ని విషయాలు.

మధుప్రియ అంటే గుర్తు పట్టడం కాస్త కష్టమేమో… కానీ,  ఆడపిల్లనమ్మ పాట మధుప్రియ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు, పక్కదేశాల్లో ఉంటున్న మనవాళ్లకు కూడా  చాలా సుపరిచితం. అమ్మ పొత్తిళ్ళలోనే పాటనేర్చుకున్న  కోకిలమ్మ ఆమె. మాటివి సూపర్ సింగర్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచ నలుమూలలకు ఆమె టాలెంట్ తెలిసింది. ఈ రోజు( ఆగస్ట్ 26)  ఆ పాటల కోకిల బర్త్ డే.. హ్యాపీ బర్త్ డే మధుప్రియ. దేశ విదేశాల్లోని  ఎన్నో వేదికలపై… ఎన్నో ప్రోగ్రామ్స్ .. ఆడపిల్లనమ్మ మధుప్రియ వచ్చిందా ఈ ప్రోగ్రామ్ కు ..? అంటూ ఆరా తీసి మరీ వచ్చే వారు అనేకం. అంతలా మాయ చేస్తుంది ఆమె స్వరం, అంతలా ఆలోచింపజేస్తుంది ఆమె పాట.

 

మధుప్రియ గురించి మరికొన్ని విషయాలు:

  • మధు ప్రియ తన నాల్గవ తరగతిలోనే ఆడపిల్లనమ్మా పాట రాసి.. సమాజంలో ఆడపిల్లల పట్ల చూపుతున్న వివక్షతను ఎంటగట్టింది.
  • నడక సరిగ్గా రాకముందే …కాళ్లకు గజ్జె కట్టి ఎన్నో ప్రదర్శనలిచ్చింది.
  • పాట పరంగా ఎక్కవ మంది ప్యాన్స్ ను పొందిన పాట మధుప్రియ ఆడపిల్లనమ్మ
  • ఇప్పటికీ ఏ ప్రోగ్రామ్ కు వెళ్లినా..ఆడపిల్లనమ్మ పాట పాడమని అడగకుండా వదిలింది లేదు, పాడకుండా ఆమె వచ్చిందీ లేదు.
  • ఇంత చిన్న వయస్సులో తన పేరుతో ఓ ఫౌండేషన్ స్థాపించి… చిన్న పిల్లలకు బాసటగా నిలుస్తోంది.

 

Watch Adapillanamma Song Here:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top