ఒలంపిక్స్ గోల్డ్ మెడల్ అసలు రేట్ ఎంత ఉంటుందో తెలుసా?

207 దేశాలకు చెందిన  11,544 మంది ఆటగాళ్లు, 306 విభిన్న క్రీడాంశాల్లో పతకాల కోసం బ్రెజిల్ లోని రియో సాక్షిగా  అలుపెరగని పోరాటం చేశారు. 17 రోజుల పాటు జరిగిన ఈ విశ్వక్రీడలు ఈ నెల 21 తో ముగిసాయి.  ఇంత పెద్ద ఈవెంట్ లో బహూకరించే పతకాల గురించి తెల్సుకోవాలని కుతూహలం ఉండడం సహజమే.!  రియో 2016 పతకాలు గురించి సంక్షిప్తంగా మీకోసం.

  •  రియో ఒలంపిక్స్ లో స్వర్ణం, రజతం, కాంస్యం కలిపి మొత్తం 2488 పతకాలను బహూకరించారు.
  • ఒక్కో పతకం..85 మిల్లీ మీటర్ల వ్యాసార్థం కలిగి, 500 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

addtext_com_MDgwMjEwMzEyNg

గోల్డ్ మెడల్ ఖరీదు:

ఒక్క గోల్డ్ మెడల్  ఖరీదు 38 వేల రూపాయలు. గోల్డ్ మెడల్ ను  6 గ్రాముల బంగారం+  494 గ్రాములు వెండిని కలిపి తయారు చేస్తారు.

సిల్వర్ మెడల్ ఖరీదు:

ఒక్క సిల్వర్ మెడల్  ఖరీదు 20,500/-  రూపాయలు. దీనిని పూర్తిగా  వెండితోనే తయారు చేస్తారు.

బ్రాంజ్ మెడల్ ఖరీదు:

ఒక్క బ్రాంజ్  మెడల్  ఖరీదు 200/- రూపాయలు…దీని తయారీకి 475 గ్రాములు రాగిని, 25 గ్రాముల జింక్ ను ఉపయోగిస్తారు.

Watch Video For More Info:
;

(ఇలాంటి ఆసక్తికర విషయాలను డైరెక్ట్ గా మీవాట్సాప్ లో చదవాలనుకుంటే మా నెంబర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి)

Comments

comments

Share this post

scroll to top