సినిమాకోసం “డీగ్లామర్” గా మారిన 8 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా.? లిస్ట్ మీరే చూడండి!

మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ అంటే ఎలా ఉంటుంది..నాజూగ్గా ,తెల్లగా,చాలా అందంగా ఉంటేనే ఆమె హీరోయిన్..నల్లగా ,లావుగా ,పొట్టిగా ఉంటే వారు హీరోయిన్ కాదు..మేకప్ తో అందంగా లేని హీరోయిన్ని కూడా అందంగా చూపించడానికి ట్రై చేస్తుంటారు..గ్లామర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తుంటారు హీరోయిన్లు.కాని డీ గ్లామర్ రోల్స్ లో కూడా ప్రేక్షకులను కట్టిపడేసిన కొందరు హీరోయిన్స్,కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వాటిల్లో కొందరు/కొన్ని..

సమంతా

ఇప్పటివరకు సమంతా పల్లెటూరి పిల్లగా నటించింది లేదు. త్వరలో రిలీజ్ కాబోతున్న రంగస్థలం సినిమాలో మాత్రం అచ్చమైన పల్లెటూరి పిల్లగా దర్వనమివ్వబోతుంది.ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్లో లంగావోణితో రామలక్ష్మిగా  కనపడిన సమంతా అందరిని ఆకట్టుకుంది.

ప్రియమణి

విలన్ సినిమాలో ప్రియమణి కూడా డీ గ్లామర్ రోల్ పోషించింది.విక్రమ్ చెల్లెలుగా ప్రియమణి చిన్నపాత్ర పోషించినప్పటికి మనందరికి గుర్తుండిపోయింది..ఇందులో ప్రియమణి అస్సలు మేకప్ వేసుకోకుండా నటించింది.

తమన్నా

అభినేత్రి,బాహుబలి రెండు సినిమాల్లో తమన్నా డీ గ్లామర్ రోల్స్ లో నటించింది.అభినేత్రి సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన తమన్నా రెండు పాత్రలు ఒకదానితో ఒకటి సంభందంలేనివి..ఒకటి గ్లామర్ డాల్,రెండోది దానికి పూర్తి విరుద్దమైన పాత్ర.బాహుబలిలో కూడా రెండు పాటల్లో మినహా సినిమా అంతా తమన్నా డిఫరెంట్ మేకప్ తో తన మిల్కీవైట్ నంతా దాచిపెట్టేసి డీగ్లామర్ రోల్ పోషించింది.

అనుష్క

ప్రయోగాలకు మారు పేరు అనుష్క..ఎలాంటి పాత్రనైనా సునాయసంగా చేయడమే కాదు..పాత్రకోసం తగిన విధంగా తన శరీరాన్ని మార్పులు చేర్పులు చేసుకోవడమే కాదు..పాత్ర డిమాండ్ చేస్తే అందవిహీనంగా కనపడడానికి కూడా వెనకాడదు.బాహుబలి సినిమాలో అమ్మ క్యారెక్టర్లో డీ గ్లామర్ గా చూసిన అనుష్కని మొదట్లో ఎవరూ యాక్సెప్ట్ చేయనప్పటికి,తన నటనతో అందరిని కట్టిపడేసింది.

Anushka as Devasena in Baahubali (2)

సంజనా

తెలుగులో అడపా దడపా సినిమాలు చేసిన సంజనా డీ గ్లామర్ రోల్ పోషించిన చిత్రం దండుపాళ్యం 2.ఈ సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా నటించింది సంజనా.సంజనా న్యూడ్ గా నటించిందనే కాంట్రవర్సి అప్పట్లో వచ్చింది.

రాధికా ఆప్టే

రక్త చరిత్ర సినిమాలో  రాధికా ఆప్టే సాధారణ గృహిణిగా నటించిన విషయం విధితమే.ఈ సినిమాలో హెవీ మేకప్ లేకుండా కేవలం తన నటనతోనే కట్టిపడేసింది రాధికా.

రితిక

గురు సినిమాలో బాక్సర్ గా పరిచయం అయిన నటి రితిక..ఈ సినిమాలో రాముడుగా  చేపలు అమ్మే అమ్మాయిలాగా, బాక్సర్ లాగా డీగ్లామర్ రోల్లో కనిపించి అందరిని మెప్పించింది.

అమలాపాల్

ప్రేమఖైది అనే సినిమా లో అమలాపాల్ డి గ్లామర్ గ నటించింది.

Comments

comments

Share this post

scroll to top