“ఉదయ్ కిరణ్” ఆత్మహత్య వెనకున్న నమ్మలేని నిజాలు చెప్పి ఏడ్చేసిన “సుధ”..ఏం చెప్పారంటే!

ఎన్నో సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో “అమ్మగా, అక్కగా, ఒదిన గా..” నటించి ఆడియన్స్ లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు “సుధ” గారు. “మనసంతా నువ్వే” సినిమాలో “ఉదయ్ కిరణ్” కు తల్లిగా నటించారు. సినిమాలో చూసినట్టే బయటకూడా వారు తల్లి కొడుకుల్లాగే ఉంటారంట. సుధ గారి కూతురు, ఉదయ్ కిరణ్ అన్న చెల్లెలు లాగ ఆడుకునే వారట. ఉదయ్‌తో తనకున్న అనుబంధం గురించి, ఉదయ్‌ ఆత్మహత్య గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది నటి సుధ.

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తూనే హ్యాట్రిక్‌ విజయాలు సాధించి టాప్‌హీరోగా ఎదిగాడు ఉదయ్‌కిరణ్‌. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీలను చేస్తూ యువతకు రోల్‌ మోడల్‌గా మారాడు. అలాంటి ఉదయ్‌కిరణ్‌ కెరీర్‌ ఒక్కసారిగా డౌన్‌ఫాల్‌ అయ్యింది. ఆ దిగులుతో ఏకంగా ఆత్మహత్య కూడా చేసుకున్నాడు ఉదయ్‌కిరణ్‌.

Watch Video:

గతంలో ఒకసారి తన పెళ్లి ఆగిపోయినపుడు మణికొండలో ఓ హోటల్‌ రూమ్‌లో ఉన్న నా దగ్గరకు వచ్చి బాధతో కాళ్లు పట్టుకుని ఏడ్చాడు. మెల్లగా అంతా సర్దుకుంటుందని నచ్చచెప్పాను. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’ సినిమా షూటింగ్‌లో ఉన్న సమయంలో నాకు ఉదయ్‌ చనిపోయిన విషయం తెలిసింది. ఆత్మహత్య తర్వాత బతికుంటే వాణ్ని కొట్టేదాన్ని. సినిమాలు లేకపోతే వేరే ఉద్యోగం చేసుకోవాల్సింది. వాడిని దత్తత తీసుకుని ఉంటే చనిపోయేవాడు కాదు కదా అని అనుకునేదాన్ని. ఉదయ్‌ మరణ వార్త విని నా కూతురు కూడా ఎంతో ఏడ్చింద’ని చెప్పింది సుధ.

Watch Full Interview Here:

అంతే కాకుండా ఇప్పుడు తల్లి పాత్రల్లో నటించే వారిపై తనకు జాలేస్తుంది అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు సినిమాలో జస్ట్ అలా నించుంటారు అంతే. ఇంకేం చెప్పారో చూడండి!

Comments

comments

Share this post

scroll to top