బికినీలు, చెడ్డీలు వేసుకుని ఫొటోలు తీసి పంపు అని ఆ పోలీస్ అధికారి కామెంట్ పెట్టాడు. అందుకు ఆ న‌టి ఎలా స్పందించిందో తెలుసా..?

కనకపు సింహాసనమున.. శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం.. దొనరగ బట్టము గట్టిన.. వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ.. అనే ప‌ద్యం చ‌దువుకున్నాం గుర్తుంది క‌దా. బంగారంతో త‌యారు చేసిన సింహాస‌నం మీద కూర్చుండ‌బెట్టినంత మాత్రాన కుక్క త‌న స‌హ‌జ బుద్ధిని వ‌దులుతుందా ? అని ఈ ప‌ద్యం సారాంశం. అయితే ఆ పోలీసు అధికారి కూడా సరిగ్గా ఇలాగే ప్ర‌వ‌ర్తించాడు. పోలీస్ యూనిఫాం వేసుకుని ఉన్న‌ప్ప‌టికీ త‌న స‌హ‌జ గుణాన్ని వదిలిపెట్ట‌లేదు. మ‌హిళ‌లను వేధించే త‌న బుద్ధిని బ‌య‌ట పెట్టాడు. దీంతో ఇప్పుడు అంద‌రి చేత విమర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నాడు. నెటిజ‌న్లు అయితే ఆ పోలీస్ అధికారి చేసిన ప‌నికి పెద్ద ఎత్తున అత‌న్ని తిడుతున్నారు. ఇంత‌కీ అస‌లు జ‌రిగిన విష‌యం ఏమిటంటే…

మీకు షిఖా సింగ్ తెలుసా.? ఈమె హిందీలో ప్ర‌సార‌మ‌య్యే కుంకుమ్ భాగ్య అనే సీరియ‌ల్‌లో న‌టిస్తోంది. టాప్ న‌టిగా ఈమె పేరు కూడా తెచ్చుకుంది. అప్పుడ‌ప్పుడు ఫొటోషూట్స్ చేస్తుంది. వాటిలో బాగా ఆక‌ట్టుకునే ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పెడుతుంది. అలా ఈ మ‌ధ్యే ఓ ఫొటోను పెట్ట‌గా.. అందుకు చాలా మంది ర‌క ర‌కాల కామెంట్ల‌ను పెట్టారు. అయితే ఆ కామెంట్ల‌లో జ‌గ‌దీష్ గుంగె అనే ముంబైకి చెందిన ఓ పోలీస్ ఆఫీస‌ర్ కామెంట్ కూడా ఉంది. ఇంత‌కీ అత‌ను ఏమ‌న్నాడంటే… చాలా అందంగా ఉన్నావ్‌. నువ్వు చిన్న చిన్న చెడ్డీలు, బికినీలు వేసుకుని ఫొటోలు దిగి వాటిని న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌గా నాకు పంపు.. అంటూ షిఖా సింగ్ ఫొటోకు కామెంట్ పెట్టాడు.

అయితే మొద‌ట షిఖా సింగ్ ఆ కామెంట్‌ను లైట్ తీసుకుంది. కానీ చివ‌ర‌కు ఆ కామెంట్‌ను జాగ్రత్త‌గా ప‌రిశీలించాక‌, దాన్ని ఎవ‌రు పంపారు అని తెలుసుకునేందుకు ఆమె ప్ర‌య‌త్నించ‌గా అప్పుడు తెలిసింది. ఆ కామెంట్ చేసింది సాధార‌ణ వ్య‌క్తి కాద‌ని, ఓ పోలీస్ అధికారి అని తెలుసుకుంది. దీంతో వెంట‌నే ఆమె జ‌గ్‌దీష్ చేసిన ప‌నిని ప్ర‌స్తావిస్తూ ముంబై పోలీసుల‌కు ఓ మెసేజ్ పెట్టింది. కేవ‌లం ట‌చ్ చేస్తేనే వేధించిన‌ట్టు కాద‌ని, ఇలాంటి అస‌భ్య‌క‌ర కామెంట్లు చేసినా వేధించ‌డ‌మే అవుతుంద‌ని ఆమె పోస్ట్ పెట్టింది. అయితే ఆమె పోస్టుకు ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై పోలీసులు స్పందించ‌లేదు. కానీ ఈ నెల 21వ తేదీన స్వ‌యంగా షిఖా సింగ్ త‌న‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాన‌ని చెబుతోంది. చూద్దాం మ‌రి.. స‌ద‌రు వేధింపుల ఆఫీస‌ర్ ప‌ట్ల ముంబై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో. అయితే ఇదిలా ఉంటే.. మ‌రోవైపు జ‌గ్‌దీష్ చేసిన ప‌ని గురించి తెలుసుకున్న నెటిజ‌న్లు మాత్రం అత‌న్ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన ఓ పోలీస్ ఆఫీస‌రే ఇలా బ‌రి తెగిస్తే ఇక మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఎవ‌రిస్తారు అని చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు. వెంట‌నే అత‌నికి బుద్ధి చెప్పాల‌ని, అత‌న్ని ఉద్యోగం నుంచి తొల‌గించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వార్త కాస్తా నెట్‌లో వైర‌ల్ అయ్యింది..!

Comments

comments

Share this post

scroll to top