పేరుకి హీరోయిన్…”శ్రీదేవి” చనిపోతే ఎలా అవమానిస్తూ ట్వీట్ చేసిందో చూడండి.! సన్నీ లియోన్ చనిపోతే అంటూ..!

కాదేది పబ్లిసిటికి అనర్హం అన్నట్టు..ఈ మధ్య కాలంలొో పాజిటివ్ కన్నా నెగటివ్ ప్రచారాన్నే  కోరుకుంటున్న వారెక్కువయ్యారు.. ఏదైతేనేమి జనాల నోళ్లల్లో నానాలనే తాపత్రయమే ఎక్కువగా కనపడుతుంది.సెలబ్రిటిలలొ ఇలాంటి నేచర్ ఎక్కువగా ఉంటుంది..దీనికి చక్కటి ఉదాహరణ నటి కస్తూరి. శ్రీదేవి మరణాన్ని ఎవరికి నచ్చిన రీతిలో వారు ఉపయోగించుకుంటున్నారు.. కస్తూరి కూడా శ్రీదేవి మరణం గురించి మీడియా గురించి ట్వీట్ చేసింది..

ఈ మధ్య ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో నిలవడం అలవాటు చేసుకుంది నటీమణి కస్తూరి.మొన్నటికి మొన్న తను కూడా క్యాస్టింగ్ కోచ్ బాధితురాలినే అని అప్పట్లో కస్తూరి ప్రకటించుకుంది. తనను దక్షిణాది హీరో ఒకరు లైంగికంగా వేధింపులకు గురి చేసే యత్నం చేసినట్టుగా చెప్పుకుంది. అయితే అతడెవరో మాత్రం చెప్పలేదు. అతడు రాజకీయాల్లోకి వెళ్లాడని క్లూ ఇచ్చి అంతటితో ఆగింది.అవునా అంటూ ముక్కున వేలేసుకున్నారు..అర్రే అందుకే అవకాశాలు రాలేదేమో అని సానుబూతి చూపించారు. ఆ తర్వాత రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ మీద  రాజకీయాల్లోకి రావడాన్ని వాయిదా వేస్తూ రజనీ బోర్ కొట్టిస్తున్నాడని ట్వీట్ పెట్టింది..ఇప్పుడు శ్రీదేవి మరణాన్ని,సన్నిలియోన్ లింక్ చేస్తూ ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురౌతుంది.

‘శ్రీదేవి మరణించారని.. ఆమె నటించిన సినిమాల క్లిప్స్ ను చూపిస్తున్నారు.. ఒక రోజుకు సన్నీ లియోన్ చనిపోతే ఏం చూపుతారో..’ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది కస్తూరి. శ్రీదేవి మరణంతో బాధలో ఉన్న ఆమె అభిమానులను ఇబ్బంది పెట్టడంతో పాటు, మధ్యలోకి సన్నీ లియోన్ ను లాక్కొచ్చి.. ఆమె చనిపోతే.. అంటూ ట్వీట్ చేయడం.. కస్తూరి కుచిత బుద్ధిని, వార్తల్లో నిలవాలనే ఆమె ఆరాటాన్ని అర్థమయ్యేలా చేస్తోందని నెటిజన్లు అంటున్నారు..నెటిజన్లు అనడం పక్కన పెడితే సంధర్బం ఏంటి ఆవిడ పెట్టిన ట్వీటేంటి అని ఎవరికైనా అనిపించకమానదు..

Comments

comments

Share this post

scroll to top