“అర్జున్ రెడ్డి” సినిమాలో బామ్మగా నటించిన నటి ఎవరో తెలుసా..? ఆమె గురించి ఆసక్తికర విషయాలు..!

కాంచన ఒకప్పటి తెలుగు నటి..మనుషులు మారాలి,మంచి కుటుంబం,అవే కళ్లు లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.తన నటనతో ,అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ కాలంలోనే స్విమ్ సూట్ ధరించి గ్లామరస్ నటిగా క్రేజ్ సంపాదించుకుంది.ఇప్పుడు ఈమె గురించి ఎందుకు అంటే చాలా ఏళ్ల తర్వాత కాంచనని మనం స్క్రీన్ పై చూసాం..అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ బామ్మగా కాంచన నటించారు… అప్పటికి  ఇప్పటికి ఏ మాత్రం తీసిపోనీ నటనతో ఆకట్టుకున్నారు..నటనతో ఆకట్టుకున్న ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని మీకు తెలుసా..కాంచన గురించి కొన్ని విషయాలు..

సినీ జీవితం

ఉన్నత కుటుంబములో జన్మించిన ఈమె చిన్న తనములోనే భరత నాట్యం మరియు సంగీతంలో శిక్షణ పొందింది..  కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించింది..అప్పుడే దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించిచూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూధనరావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారుబాట వేసింది. తర్వాతకె.విశ్వనాధ్ దర్శకత్వంలో ఆత్మ గౌరవంలో పోషించిన నాయిక పాత్రలో గ్లామర్ తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి.  కాంచన సాంఘిక చిత్రాలే కాదు దేవకన్య, అందం కోసం పందెం,శ్రీకృష్ణావతారం వంటి జానపద, పౌరాణిక చిత్రాలలో మంచి నటనను ప్రదర్శించారు.కాంచన నట జీవితానికి మిగిలిపోయే పాత్రను కళ్యాణమండపంలో పొషించారు. ఈ చిత్రానికి మాతృక కన్నడలో వచ్చిన ‘గజ్జె పూజ’. ఒక వేశ్య కూతురుగా సంఘంలో గౌరవం పొందటం కోసం తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయం, తృప్తి, అవ్యక్త మధురానుభూతితో మథనపడుతూ కాంచన పోషించిన నటనకు ప్రేక్షకుల కళ్ళు చమర్చాయి. హీరోయిన్ గా రిటైరైన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్ర పోషించారు

నాణెనికి మరోవైపు

కన్నతల్లిదండ్రులనుండే కష్టాలను ఎదుర్కొన్నారు కాంచన.తనకు తెలియకుండా తెల్లకాగితం పై సంతకం చేయించుకుని ఆస్తి మొత్తం సొంతం చేసుకోవడమే కాకుండా..తమ కూతురు చెడిపోయిందంటూ కాంచనపై లేనిపోనీ ప్రచారాలు చేసి పెళ్లి కాకుండా చేశారు.కాంచన తన జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉన్నారు.ఎటు దిక్కుతోచని స్థితిలో ఒక గుడిలో ఉంటూ కాలం వెళ్లదీశారు.కోర్టులో తల్లిదండ్రులకు వ్యతిరేఖంగా కేసు వేసి సుధీర్ఘపోరాటం తర్వాత 15కోట్ల ఆస్తిని కాంచన దక్కించుకోగలిగారు.ఆ ఆస్తి మొత్తం కూడా టిటిడికి ఇచ్చేసారు.తర్వాత సాధారణ జీవితం గడుపుతూ..అదిగో ఇప్పుడు ఇలా అర్జున్ రెడ్డిలో మెరిసే ఆవిడ అభిమానులనే కాదు తెలుగు సినిమా అభిమానులను కూడా ఆశ్చర్యానికి,ఆనందానికి గురిచేశారు.ఎన్నో ప్రయత్నాల అనంతరం ఆవిడ ఈ సినిమా ఛాన్స్ ఒప్పుకున్నారట..

నిజంగా సినితారల జీవితాలు ఏ నిమిషానికి ఏ మలుపు తిరుగుతాయి.. అనేదానికి కాంచన జీవితం ఒక చక్కటి ఉదాహారణ.

Comments

comments

Share this post

scroll to top