పూరి జగన్నాధ్ మేఘాల్లో సూర్యుడు లా ఉన్నాడు, త్రివిక్రమ్ కి నాకు పడదు-నటి హేమ..!!

నటి హేమ పరిచయం తెలుగు ప్రేక్షకులకు అవసరం లేదు, ఎప్పటినుండో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆమె, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె, 2014 ఎన్నికల్లో కూడా ఆమె పాల్గొన్నారు, కానీ విజయం సాధించలేకపోయారు. ఇటీవలే వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆమె, సినిమాలో కియారా అద్వానీ తల్లి పాత్రలో ఆమె నటించారు, ఆమె క్యారెక్టర్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె పూరి జగన్నాథ్ పైన సంచలనమైన కామెంట్స్ చేసారు.

ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. :

‘నా కోసం సినిమా కి వచ్చే వారు కూడా ఉంటారు, డైరెక్టర్ హీరో కోసం 100 మంది వస్తే, నా కోసం 15 మంది అయినా వస్తారు. వినయ విధేయ రామ చిత్రం తో ఆ విషయం నిరూపించుకున్నా’ అని నటి హేమ తెలిపారు.

నాకు త్రివిక్రమ్ కి పడదు.. :

త్రివిక్రమ్ ఇటీవల సినిమాల్లో నేను నటించకపోడానికి కారణం ఆయనతో నాకు జరిగిన విభేదాలే. రెమ్యూనరేషన్ విషయంలో ఇద్దరికి విబేధాలు జరిగాయి, అందుకే ఆయన సినిమాల్లో నేను నటించటం లేదు, ఆయన కనిపించినా తల పక్కకు తిప్పుకొని వెళ్తున్నా, అంత కోపం ఉంది నాకు త్రివిక్రమ్ పైన’ అని నటి హేమ తెలిపారు.

అంత ధైర్యం చేసేవాడు లేడు.. :

“నాతో ఇండస్ట్రీ లో ఇంతవరకు ఎవ్వరు తప్పుగా ప్రవర్తించలేదు, మీటూ గురుంచి చెప్పాలంటే నా దెగ్గరకు వచ్చే సాహసం ఎవ్వరు చెయ్యలేదు ఇండస్ట్రీ లో చెయ్యరు కూడా. ఇక నాతో ఒక దర్శకుడు దురుసుగా ప్రవర్తించాడు. షూట్ కోసం ప్రిపేర్ అవుతుంటే, ‘ఏడుపు మొఖం మెట్టుకున్నావ్ ఏంటి, ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడు ఏడవకు’ అంటూ ఆ దర్శకుడు నాతో దురుసుగా ప్రవర్తించాడు” అంటూ నటి హేమ తెలిపారు.

పూరి జగన్నాధ్ కి ఆ మేఘం తొలిగితే ప్రకాశిస్తాడు.. :

‘పూరి జగన్నాధ్ తో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది, కానీ ఛార్మి తో పరిచయం లేదు. పూరీజగన్నాధ్ ని మేఘం కమ్మేసింది, ఆ మేఘం తొలిగినప్పుడే పూరీజగన్నాధ్ ప్రకాశిస్తాడు, ఆ మేఘం ఎవరో అందరికి తెలుసు’ అని నటి హేమ తెలిపారు. అయితే ఇప్పుడు ఆ మేఘం ఎవరనేది సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది, నటి హేమ పరోక్షంగా ఛార్మి పైన కామెంట్ చేసిందని కొందరు అంటున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top