ఆ మహాతల్లి పెట్టిన ఫిట్టింగ్ కి ఇబ్బందులు పడుతున్నారు.. శ్రీ రెడ్డి పైన విరుచుకుపడ్డ నటి హేమ.!!

శ్రీ రెడ్డి అంటే కాంట్రవర్సీ, కాంట్రవర్సీ అంటే శ్రీ రెడ్డి ఆనేలాగా మారింది ఇండస్ట్రీ లో.. దాదాపు 8 నెలల క్రితం మొదలైన వ్యవహారం, ఇప్పటికీ ఏదో ఒక రూపం లో బయటపడుతూనే ఉంది. శ్రీ రెడ్డి ఎప్పుడైతే ఇండస్ట్రీ లో మనుషులను టార్గెట్ చేసిందో, అప్పటి నుండి ఇండస్ట్రీ పైన నెగిటివ్ గా ఆలోచించే వారి సంఖ్య పెరిగింది, ముందు నుండి ఇండస్ట్రీ వర్గాలు అంటే ఇష్టపడని వాళ్ళు, శ్రీ రెడ్డి మాటల్ని చూపించి ఎత్తి పొడవడం మొదలెట్టారు, శ్రీ రెడ్డి చెన్నై కి షిఫ్ట్ అయ్యాక కూసింత కుదుట పడ్డారు మన ఇండస్ట్రీ జనాలు.

ఆ మహాతల్లి.. :

నటి హేమ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో సంచలనమైన కామెంట్స్ చేసారు కొందరి పైన, అందులో శ్రీ రెడ్డి ఒకరు, శ్రీ రెడ్డి గురుంచి నటి హేమ మాట్లాడుతూ.. : ‘కెరీర్ కోసం ఏదో చేసుకోవడం తప్పని అనుకోవడం లేదు, అవసరాలు తీర్చుకోవడం కోసం ఆ పని చేసి మీటూ అనడం కెరీర్ కోసం ఏదో చేసి, వాడు నన్ను గోకాడు, ఇలా అన్నాడు అంటూ ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడడం ఏంటండీ అసలు, మన అవసరాలు తీరడం కోసం తప్పు చేసి ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు బయట ఎన్నో తప్పులు, దారుణాలు జరుగుతున్నాయి, వాటిని ఇండస్ట్రీకి చెందిన దర్శకులు, కుర్రాళ్లు ఎవరైనా చేస్తున్నారా.? . శ్రీరెడ్డి గురుంచి చెప్పాలంటే ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు పెళ్లిళ్ళు కావడం లేదు, ఆ మహాతల్లి(శ్రీరెడ్డి) పెట్టిన ఫిటింగ్ కి ఇండస్ట్రీ అమ్మాయిలకు అద్దెకు ఇళ్లు కూడా ఇవ్వడం లేదు’ అని శ్రీ రెడ్డి పైన విరుచుకుపడ్డారు నటి హేమ.

‘సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఆడవాళ్ళూ మగవాళ్ళు కలిసి పనిచేసుకునే ప్రతి చోట ఇబ్బందులు ఉంటాయి, నీ అవసరం కోసం అలాంటివి చేసి, తరువాత కావాలని బహిర్గతం చేసి అది చేసాడు ఇది చేసాడు అనడం తప్పవుతుంది, ఇండస్ట్రీ లో కూడా మంచి వారు ఉన్నారు, అందరూ రేప్ లు చేసే వారే ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు కొందరు, మనం ఒప్పుకోకుంటే ఎవ్వరు బలవంతం చెయ్యరు’ అని నటి హేమ తెలిపారు.

నాకు త్రివిక్రమ్ కి పడదు.. :

త్రివిక్రమ్ ఇటీవల సినిమాల్లో నేను నటించకపోడానికి కారణం ఆయనతో నాకు జరిగిన విభేదాలే. రెమ్యూనరేషన్ విషయంలో ఇద్దరికి విబేధాలు జరిగాయి, అందుకే ఆయన సినిమాల్లో నేను నటించటం లేదు, ఆయన కనిపించినా తల పక్కకు తిప్పుకొని వెళ్తున్నా, అంత కోపం ఉంది నాకు త్రివిక్రమ్ పైన’ అని నటి హేమ తెలిపారు

పూరి జగన్నాధ్ కి ఆ మేఘం తొలిగితే ప్రకాశిస్తాడు.. :

‘పూరి జగన్నాధ్ తో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది, కానీ ఛార్మి తో పరిచయం లేదు. పూరీజగన్నాధ్ ని మేఘం కమ్మేసింది, ఆ మేఘం తొలిగినప్పుడే పూరీజగన్నాధ్ ప్రకాశిస్తాడు, ఆ మేఘం ఎవరో అందరికి తెలుసు’ అని నటి హేమ తెలిపారు. అయితే ఇప్పుడు ఆ మేఘం ఎవరనేది సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది, నటి హేమ పరోక్షంగా ఛార్మి పైన కామెంట్ చేసిందని కొందరు అంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top