తన ఇంట్లోనే దొంగతనం చేసాడని భర్తపై కేసుపెట్టిన “నటుడు సామ్రాట్” భార్య.! చివరికి అతను అరెస్ట్.!

సినీ నటుడు సామ్రాట్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. భార్యను వేధిస్తున్నాడంటూ ఇప్పటికే 498/A కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. కొంత కాలంగా సామ్రాట్ రెడ్డి – అతని భార్య స్వాతిరెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన ఇంట్లోనే దొంగతనం చేశాడని భార్య స్వాతిరెడ్డి కంప్లయింట్ లో చెప్పింది. రెండేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ఏడాదిపాటు సవ్యంగా సాగిన వీరి కాపురంలో.. ఏడాది కాలంగా గొడవలు జరుగుతున్నారు. భార్య స్వాతిరెడ్డి కంప్లయింట్ తో ఇది రచ్చకెక్కింది. జనవరి 29వ తేదీ సోమవారం రాత్రి మాదాపూర్ పోలీసులు సామ్రాట్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సామ్రాట్ రెడ్డితోపాటు అతని సోదరి సాహితీరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సామ్రాట్ రెడ్డి పంచాక్షరి, తకిట తకిట, బావా, దేనికైనా రెడీతోపాటు చాలా సినిమాల్లో నటించాడు.

Comments

comments

Share this post

scroll to top