పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి 40 పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి – నటి అపూర్వ

తన పైన వచ్చిన పుకార్లకు చెక్ పెట్టింది నటి అపూర్వ. దేందులూరు ఎమ్మెల్యే పైన ఆమె చేసిన విమర్శలకు ఆ ఎమ్మెల్యే అనుచరులు నటి అపూర్వ పైన పుకార్లు సృష్టించారు, వీటికి స్పందిస్తూ నటి అపూర్వ మాట్లాడుతూ : ” కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే చూస్తారు, మరో వైపు కూడా చూడాలి అని దేందులూరు ఎమ్మెల్యే పైన నేను ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాను, ఈ విషయం అయి దెందులూరు ఎమ్మెల్యే అనుచరులు నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు, లేని పోనీ పుకార్లు పుట్టించారు. నేను కూడా టీడీపీ కార్యకర్తనే, కానీ టీడీపీ ఎమ్మెల్యే అధికారం లో ఉంటె ఆయన్ని ప్రశ్నించే హక్కు నాకు లేదా. నన్ను పెళ్లి చేసుకున్న నా మావయ్య, నాకు తెలీకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టాడు, నాకు ఒక కూతురు, అయన నాకు విడాకులు ఇవ్వకుండా, అమ్మాయి ఉందని తెలిసి కూడా వేరే కాపురం పెట్టిన అతనిని ఏమనకుండా, అతన్ని తీసుకొని నా మీద మీటింగ్ పెడతారు, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. మా తల్లి ని కూడా అరెస్ట్ చేసారు, ఆమె వయసు 58 సంవత్సరాలు. ఆమె ఏదో చేసిందని మీరు అరెస్ట్ చేస్తారు, ఆ వయసులో ఆమె ఏం చెయ్యగలరు”, అని నటి అపూర్వ మీడియా ముందు మాట్లాడారు.

జగన్ తో ఉంటావ్, పవన్ తో ఉంటావ్ :

“ఊర్లో పెట్టిన ప్రెస్ మీట్ లో నా పైన చాలా అసభ్యంగా మాట్లాడారు, ఊరు విడిచి పెట్టి వెళ్ళా అని, ఇంటికి నిప్పంటించా అని నా పైన నిందలు వేశారు. పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు కాకుంటే 40 పెళ్లిళ్లు చేసుకుంటాడు, మీరెవరు ఆయన్ని అనడానికి. నన్ను మోసం చేసిన మా మామయ్య ను పక్కనే కూర్చోపెట్టుకొని ప్రెస్ మీట్ లు పెడతారు మీరు, మా మామయ్య తప్పు చేస్తే ఆయన్ని ఏం అనని మీరు వేరే వాళ్ల గురుంచి మాట్లాడతారా. జగన్ తో తిరుగుతా పవన్ తో తిరుగుతా అని అసభ్యంగా మాట్లాడుతున్నారు” , అని నటి అపూర్వ బాధ పడుతూ చెప్పారు.

మీ బండారం అంతా బయట పెడతా :

నేను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది, నన్ను సిల్క్ స్మిత అన్నా ఇంకొకటి అన్నా నాకు పెద్ద ప్రాబ్లెమ్ లేదు, మీ ఒక్కొక్కరి చరిత్ర నాకు తెలుసు, మీ అందరి చరిత్ర కానీ బయట పెడితే మీ పిల్లోళ్లకి పెళ్లిళ్లు కూడా అవ్వవు, నా జోలికి రాకండి అంటూ మీడియా ముందు వారిని హెచ్చరించారు నటి అపూర్వ.

watch video :

Comments

comments

Share this post

scroll to top