న‌క్స‌ల్స్ దాడిలో మృతి చెందిన 12 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 9 ల‌క్ష‌లు అంద‌జేశాడు న‌టుడు అక్ష‌య్ కుమార్

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ రీల్ లైఫ్‌లోనే కాదు, రియ‌ల్ లైఫ్‌లో కూడా స్టార్ అని అనిపించుకున్నాడు. న‌క్స‌ల్స్ దాడిలో మ‌ర‌ణించిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆయ‌న ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించ‌డ‌మే కాదు, వెంట‌నే ఆ మొత్తాల‌ను వారి వారి కుటుంబ స‌భ్యుల అకౌంట్ల‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేశాడు. ఈ మ‌ధ్యే చ‌త్తీస్‌గ‌డ్‌లో న‌క్స‌ల్స్ జ‌రిపిన దాడిలో 12 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. వారి మృతికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తూ హీరో అక్ష‌య్‌కుమార్ ఆ మేర‌కు స‌హాయం చేశాడు.

219వ బెటాలియ‌న్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు వారు. వారిలో ఇన్‌స్పెక్ట‌ర్ జ‌గ్‌జిత్ సింగ్‌, అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు హెచ్‌బీ భ‌ట్‌, న‌రేంద‌ర్ కుమార్ సింగ్‌, హెడ్ కానిస్టేబుల్స్ జ‌గ‌దీష్ ప్ర‌సాద్ విష్ణోయ్‌, పీఆర్ మిండె, కానిస్టేబుళ్లు మంగేష్ పాల్ పాండే, రాంపాల్ సింగ్ యాద‌వ్‌, గోర‌క్‌నాథ్, నంద్ కుమార్ ప‌త్రా, సతీష్ కుమార్ వ‌ర్మ‌, కె. శంక‌ర్‌, సురేష్ కుమార్‌లు ఉన్నారు. మొత్తం వీరు 12 మంది జ‌వాన్లు. వీరు చ‌త్తీస్‌గ‌డ్‌లో నిర్వ‌హిస్తున్న యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్స్‌లో భాగంగా విధులు నిర్వ‌హిస్తున్నారు.

అయితే ఈ నెల 11వ తేదీన జ‌రిగిన న‌క్స‌ల్స్ దాడిలో ఈ జ‌వాన్లంతా మృతి చెందారు. దీంతో ఈ ఘ‌ట‌న ప‌ట్ల బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ స్పందించారు. వెంట‌నే కేంద్ర హోం శాఖ‌ను సంప్ర‌దించి స‌ద‌రు జ‌వాన్ల‌కు చెందిన బ్యాంక్ అకౌంట్ల‌ను సేక‌రించారు. అనంత‌రం వారి అకౌంట్ల‌లో ఒక్కొక్క‌రికి రూ.9 ల‌క్ష‌ల చొప్పున ట్రాన్స్‌ఫ‌ర్ చేసి త‌న ఉదార‌త‌ను చాటుకున్నాడు. అయితే అక్ష‌య్ అంత‌టితో ఆగ‌డం లేదు. ఇలా ఉగ్ర‌వాదులు, న‌క్స‌ల్స్ చేతిలో మ‌ర‌ణించే జ‌వాన్ల కుటుంబాల‌కు అండ‌గా ఉండేందుకు గాను ఓ యాప్‌ను త‌యారు చేయిస్తాన‌ని, దానికి అంద‌రూ స‌పోర్ట్ ను ఇవ్వాల‌ని అత‌ను తెలియజేశాడు. ఏది ఏమైనా… అక్ష‌య్ రీల్ లైఫ్‌లోనే కాదు, రియ‌ల్ లైఫ్ లోనూ హీరోయే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top