టాలెంట్ నిరూపించుకోడానికి సరైన వేదిక..క్లిక్ అయితే స్టార్స్ అయిపోవచ్చు..!

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమర్పించు సినీవారం, యెన్నెన్జీ మోషన్ పిక్చర్స్ వారి హృదయాంజలి ఫీచర్ ఫిలిం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాక్టింగ్ టాలెంట్ హంట్ “యాక్ట్ యాక్టింగ్ & యాక్టర్ …(AA&A) కార్యక్రమం తెలంగాణలోని నూతన నటీనటులకు మంచి వేదిక కానుంది.

తెలంగాణలో ఉన్న ఔత్సాహిక నటులను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో మే-5,6,7 తేదీల్లో ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకూ నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారుల డేటాను భద్రపరిచి టాలెంట్ బ్యాంక్ ను తయారుచేసి ఫిలిం మేకర్స్ అందరికీ అందుబాటులో ఉంచేలా చేయడమే ఈ టాలెంట్ హంట్ ఉద్దేశం.

అలాగే ఇందులో పాల్గొన్నవారిలో కొందరికి త్వరలో రాబోతున్న ఫ్రెండ్స్ ఫండింగ్ త్రిభాషా ఫీచర్ ఫిలిం హృదయాంజలి చిత్రంలో నటించే అవకాశం ఇవ్వగలమని దర్శకుడు యెన్నెన్జీ తెలిపారు. సినీవారంలో పాల్గొనే ఇతర ఫిలిం మేకర్స్ కూడా తమ సినిమాల్లో ఈ కళాకారులను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిపారు.

ఏ వయసు కళాకారులైనా ఈ హంట్ కు హాజరు కావచ్చనీ…. ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని తెలిపారు. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వారు తమ తల్లిదండ్రులతో కలిసి రావాలి. ఫోటో మరియు ఏదేనా గుర్తింపు కార్డు జిరాక్స్ తో రవీంద్రభారతికి హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు 9912376894 కి కాల్ చేయవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమ పోస్టర్ ని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హృదయాంజలి దర్శకుడు యెన్నెన్జీ , ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సోనియా ఆకుల , ఆడిషన్ డైరెక్టర్ వీజే గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Share this post

scroll to top