రాము: అరేయ్ నువ్వెలా పాస్ అయ్యావ్ రా? నా ముందే కదా ఖాళీ పేపర్ ను ఇన్విజిలేటర్ కు ఇచ్చావ్ కదా.!
సోము: అదే రా యాక్ట్ ఆప్ గాడ్ అంటే………….
రాము: కాస్త వివరంగా చెప్పు.
సోము: వాస్తవానికి నాకొచ్చిన మార్కులు 0, అవే మార్కులు నా మెమో మీద ప్రింట్ చేస్తున్న టైమ్ లో….దేవుడు ఓ ఈగను నాకోసం పంపించాడు… అది సరిగ్గా మార్క్స్ ప్రింట్ అయ్యే సమయంలో 0 పక్కన వచ్చి వాలింది. దాంతో ప్రింట్ ప్రెస్ అయ్యింది…ఈగ కాళ్లు 4 ఆకారంలో ప్రింట్ అయ్యాయ్….
0 కు ముందు 4 వచ్చి చేరింది….ఫైనల్ గా నాకు 40 , నేను పాస్..!
దటీజ్ యాక్ట్ ఆప్ గాడ్.
లేకపోతే ఏంటండీ….నాణ్యత సరిగ్గా లేక ఇంకా నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోతే బాద్యత వహించాల్సింది పోయి….మా సైడ్ అంతా ఓకే కానీ ఇది యాక్ట్ ఆప్ గాడ్ అంటూ గోపాల గోపాల సినిమా చూపిస్తా అంటే ఎవరు మాత్రం అర్థం చేసుకోలేరు చెప్పండి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం లో ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మరీ ఇలానా?? నాణ్యతను గాలికి ఒదిలి…ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమా?