ఓటు కు నోటు కేసులో అనుకోని పేరు తెర మీదకు.

రాష్ట్ర రాజకీయాలను కుదుపేస్తున్నఓటు కు నోటు వ్యవహారం కొత్త ముఖాన్ని తెర మీదకు తెచ్చింది. మంగళవారం  రోజంతా నోటీసుల వ్యవహారం హట్ టాపిక్ గా మారింది.ఏసిబి ఆంద్రప్రదేశ్ సిఎం, సిఎం రమేష్ లలో ఒకరికో, లేక ఇద్దరికో నోటీసులు జారీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ సాయంత్రం వరకు కామ్ గా ఉన్న ఏసిబి అధికారులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటట వీరయ్యను విచారణ అధికారి ముందు హజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

SANDRA-VENKATA-VEERAIAH

 

ఏసీబీ బృందం హైదర్ గూడలోని టీడీపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ నంబర్ 208 (ఇంటికి)కి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులను అంటించారు. ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఏసిబి అధికారులు  సండ్ర తో పాటు  టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి కి కూడా నోటీసులు జారీ చేసారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top