రాబోతుంది లైఫై… ఇక చిటికెలో బ్రౌజింగ్.! లోడింగ్..లోడింగ్ అనే మాటలకిక చెక్!

మొబైల్ డేటా, వైఫై వాడుతున్నా బ్రౌసింగ్, డౌన్ లోడ్ చాలా నెమ్మదిగా ఉందని చిరాకు పడుతున్నారా? ప్రత్యామ్నాయం లేక ఇక ఇంతేనని వాటినే భరిస్తున్నారా? అయితే సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో పనిచేసే ఆయుధం వచ్చేస్తోంది. లైటింగ్ వెలుతురుతో పని చేసే ఈ సిస్టం పేరు ‘లైఫై’. కాంతినుండి వెలువడే కిరణాల ద్వారా ఈ లైఫై పనిచేస్తుంది. స్కాట్ ల్యాండ్ ఎడిన్ బర్గ్ యునివర్సిటీకి  చెందిన హెరాల్డ్ హాస్ 2011 లో లైఫైని కనుగొన్నాడు. ఈ లైఫై ఎంత వేగంగా పనిచేస్తుందంటే మన కంటితో చూడలేనంత వేగంగా ఈ లైఫై పని చేస్తుంది. కొన్ని ఎక్స్ పరిమెంట్స్ చేసిన తర్వాత ఎల్ఈడీ కాంతి కిరణాల ద్వారా సెల్యులర్ టవర్ కన్నా ఎక్కువగా ఈ లైఫై నుండి డేటా వస్తుందని హోరాల్ద్ హాస్ నిరూపించాడు.

 lifi
టెక్నాలజీతో పాటు, ఫైలేట్ ప్రాజెక్ట్ లపై దీనిని పరిశీలించిన సైంటిస్ట్స్ ప్రస్తుతం ఓ స్మార్ట్ లైట్ సొల్యుషన్ ను విజిబుల్ లైట్ కమ్యునికేషన్ ద్వారా డిజైన్ చేసినట్లు తెలిపారు. వైర్ లెస్ ద్వారా జరిగే ఈ ప్రాసెస్ కొరకు హాస్ ఒక యాప్ ను కూడా సిద్ధంచేశాడట. ఫ్రెంచ్ కు చెందిన దీనిని ఉపయోగించి, తమ హాస్పిటల్స్ లో కూడా ఇన్స్టాల్ చేశారట. భవిష్యత్ లో కాంతి ద్వారా నడిచే ఈ లైఫై వినియోగం ఎక్కువగా ఉంటుందని దీన్ని కనుగొన్న హాస చెబుతున్నాడు.
ఇప్పటికే లైట్ ను ఉపయోగించి మనకు తెలిసిన సమాచారాన్ని డేటాగా మార్చేందుకు కొన్ని ఎక్స్ పరిమెంట్స్ చేసి విజయవంతమైనట్లు, ఈ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ తో వర్క్ చేసే లైఫై చాలా వేగవంతంగా ఎటువంటి ఇబ్బందులు పనిచేస్తుందని 500 నుండి 800 టెరా హెడ్జ్ సామర్థ్యం ఈ లైఫైకు అప్లికేబుల్ అవుతుందని అంటున్నారు. వైర్ లెస్ కావడంతో మనకు అనువైన చోటు ఈ లైఫై ఉపయోగించుకొని మనకు కావాల్సిన డేటాను పొందవచ్చు. త్వరలోనే అపీషియల్ గా అన్ని చోట్ల వీటిని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. లైఫై వస్తే మొబైల్ డేటా,వైఫై లను ఇక పక్కన పెడతారేమో.

Comments

comments

Share this post

scroll to top