అబార్షన్ వీడియో.! చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.

జీవితంలో కనీసం ఒకసారైనా తల్లి కావాలని ప్రతి వివాహిత అయిన స్త్రీ కలలు కంటుంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల కొంత మంది మహిళలు పెళ్లి కాక ముందే గర్భవతులవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో అధిక శాతం మంది అబార్షన్ చేయించుకునేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. అయితే 3 నెలలు దాటక ముందు అబార్షన్ చేయించుకుంటే ఏం లేదు, కానీ ఆ తరువాతే కడుపులో బిడ్డ ఎదగడం ప్రారంభమవుతుంది కాబట్టి, ఆ సమయంలో అబార్షన్ చాలా ప్రమాదకరమని అంటున్నారు గైనకాలజిస్టులు. అయినప్పటికీ కొంత మంది 5 నెలలు దాటాక అంటే బిడ్డకు దాదాపు 20 వారాల వయస్సు వచ్చినా కూడా అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధపడతారు. ఇలాంటి సందర్భాల్లో చేసే అబార్షన్ వల్ల సదరు మహిళ భవిష్యత్తులో అనేక సమస్యలకు గురి కావల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. గర్భాశయ ఇన్‌ఫెక్షన్, హెమరేజ్, గర్భధారణ సమస్యలతోపాటు ఒక్కోసారి అలాంటి మహిళలు మృతి కూడా చెందేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
  • ఈ క్రమంలో 5 నెలలు దాటిన శిశువు కడుపులో ఉండగా అబార్షన్ ఎలా చేస్తారో డాక్టర్ ఆంథోని లెవాటినో అనే వైద్యుడు ఓ యానిమేషన్ ద్వారా వివరిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 1200 అబార్షన్లు చేశారు.
  • గైనకాలజిస్టు ముందుగా ఓ సోఫర్ క్లాంప్‌ను యోని ముఖ ద్వారం వద్ద ఉంచి గర్భాశయంలోకి సులభంగా వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తాడు.
j6oz6ncplsfvh70jzlh4
  • అనంతరం ఆ మార్గం ద్వారా ఓ క్లాంప్‌ను గర్భాశయం లోపలికి జొప్పిస్తారు. అప్పుడు అక్కడ ఉండే శిశువు కాళ్లను ఆ క్లాంప్ సహాయంతో తొలగిస్తారు.
  •  ఈ క్రమంలోనే శిశువు శరీర భాగాలన్నింటినీ కత్తిరించి తీసివేస్తారు. అయితే ఇది చూసేందుకు చాలా జుగుప్సగా అనిపిస్తుంది. దీన్ని అత్యంత దారుణమైన, అమానవీయ చర్యగా గైనకాలజిస్టులు పేర్కొంటున్నారు.
  •  అమెరికాలో దాదాపు 81 శాతం మంది 4వ నెల అబార్షన్‌లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు అక్కడి లివ్ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా 3వ నెల అబార్షన్‌లను నిషేధించాలని డిమాండ్ చేస్తోందట.
శిశువు 20 వారాల వయస్సులో ఉన్నప్పుడు అబార్షన్ చేయడం ఎంత హేయమైన చర్యో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. అయితే పైన చెప్పిన డాక్టర్ ఆంథోని లెవాటినో ఈ అబార్షన్‌కు చెందిన యానిమేషన్‌ను యూట్యూబ్ ద్వారా షేర్ చేశారు. ఆ వీడియోను ఇప్పుడు మీరు కూడా వీక్షించవచ్చు. ఒక వేళ మీరు మరీ సున్నితమైన హృదయం కలిగిన వారైతే, ఈ వీడియోను మీరు చూడకపోవడమే మంచిది.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top