ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఒకప్పుడు ఏం చేసేవాడో చూస్తే షాక్ అవుతారు..! ఇందులో నిజమెంత?

నేటి త‌రుణంలో అర‌చేతిలో ప్ర‌పంచాన్ని చూపే స్మార్ట్‌ఫోన్లు మ‌న వ‌ద్ద‌ ఉన్నాయి. చీమ చిటుక్కుమ‌న్నా తెలియ‌జేసే సోష‌ల్ మీడియా మ‌న‌కు అందుబాటులో ఉంది. దీంతో చాలా మంది చాలా వార్త‌ల‌ను కావాల‌ని వైర‌ల్ చేస్తున్నారు. అయితే వాటిల్లో కొన్ని వార్త‌లు నిజాలు ఉంటే చాలా వ‌ర‌కు వార్త‌లు వ‌ట్టి పుకారువే అయి ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో దేన్ని న‌మ్మాలో, దేన్ని న‌మ్మ‌కూడ‌దో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి నెలకొంది. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా ఇలాంటి ఓ అయోమ‌య వార్తే. ఇందులో నిజం ఉందో, లేదో తెలియ‌దు కానీ ఈ వార్త మాత్రం ఒక‌టే వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అదేమిటంటే…

పైన ఇచ్చిన చిత్రంలో చూశారా..? ఆయ‌నెవ‌రో గుర్తు ప‌ట్టారా..! వంగవీటి రంగా వెనుక చేతులు క‌ట్టుకుని ఉన్నాడు చూడండి. ఫొటోలో ఆయ‌న చుట్టూ వృత్తం కూడా వేయ‌డం జ‌రిగింది. అయితే ఇంత‌కీ ఆయ‌నెవ‌రో తెలుసా..? ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ అట‌. అవును, ఆ ఫొటోలో ఉన్న‌ది ఆయ‌నేన‌ట‌. అలా అని మేం చెప్ప‌డం లేదు. సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. ఆ ఫొటోలో ఉన్నది నిజంగానే రాధాకృష్ణ అని ఇప్పుడు వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో ఇప్పుడీ ఫొటోపైనే ఎక్క‌డ చూసినా చ‌ర్చ అంతా న‌డుస్తోంది.

కాగా అప్ప‌ట్లో వంగ‌వీటి రంగా వ‌ద్ద రాధాకృష్ణ కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేశాడ‌ట‌. ఆ స‌మ‌యంలో తీసిన ఫొటోయే ఇద‌ని చాలా మంది అంటున్నారు. అయితే దీనిపై ఆంధ్ర‌జ్యోతి స‌న్నిహితులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌ను ఆరా తీయ‌గా ఆ ఫొటోలో ఉన్న‌ది ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ కాద‌ని కొంద‌రు అన్నారు. మ‌రికొంద‌రేమో ఆయనే అయి ఉండ‌వ‌చ్చు, కానీ అప్పుడు ఆయ‌న డ్రైవ‌ర్ కాద‌ని, ఓ వార్త కోసం రంగా వెనుకాలే నిలుచున్నార‌ని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ ఫొటో మాత్రం నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే చివ‌రకు ఇది ఎక్క‌డ‌కు దారి తీస్తుందో వేచి చూడాలి..!/

Comments

comments

Share this post

scroll to top