ఐశ్వర్య కంటే ముందు “అభిషేక్” కు ఆ టాప్ హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ అయ్యింది..ఎందుకు కాన్సల్ అయ్యింది?

అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యా బ‌చ్చ‌న్‌.. బాలీవుడ్‌లో వీరిద్ద‌రిదీ చూడ‌ముచ్చ‌టైన జంట‌. ఎక్క‌డికీ వెళ్లినా ఇద్ద‌రూ క‌లిసే వెళ్తారు, వ‌స్తారు. వీరితోపాటు వీరి ముద్దుల కూతురు ఆరాధ్య‌ను కూడా వీరు తీసుకెళ్తారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆరాధ్య‌పై ప‌లువురు కామెంట్లు చేయ‌గా అందుకు అభిషేక్ సీరియ‌స్‌గా స్పందించాడు. ఇక ఈ విష‌యం పక్క‌న పెట్టి అస‌లు విష‌యానికి వ‌స్తే.. అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌ల‌ది ల‌వ్ మ్యారేజ్ అని అంద‌రికీ తెలుసు. ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెద్ద‌ల అంగీకారం మేర‌కు వివాహం చేసుకున్నారు. అయితే మీకు తెలుసా..? నిజానికి అభిషేక్ బ‌చ్చ‌న్ క‌రిష్మా క‌పూర్‌ను పెళ్లి చేసుకుందామ‌ని అనుకున్నాడ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

ఐశ్వ‌ర్యారాయ్ సీన్‌లోకి ఎంట‌ర్ కాక ముందు మొద‌ట అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టి క‌రిష్మా క‌పూర్‌ను పెళ్లి చేసుకుందామ‌ని అనుకున్నాడ‌ట‌. ఇద్ద‌రూ అప్ప‌టికే పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయార‌ట‌. అయితే.. అప్ప‌ట్లో.. అంటే.. 2002వ సంవ‌త్స‌రంలో వీరు పెళ్లి చేసుకుందామ‌ని అనుకున్నారు. కానీ క‌రిష్మా పెళ్ల‌య్యాక అభిషేక్‌ను త‌న త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలిపెట్టి సింగిల్ గా రావాల‌ని కండిష‌న్ పెట్టింద‌ట‌. దీనికి అభిషేక్ ఒప్పుకోలేద‌ట‌. దీంతో ఇద్ద‌రికీ క‌టీఫ్ అయింది.

త‌రువాత ఐశ్వ‌ర్యారాయ్‌, అభిషేక్‌ల మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుందామ‌నుకున్నారు. పెద్ద‌ల‌ను ఒప్పించారు. చివ‌ర‌కు పెళ్ల‌యింది. అయితే పెళ్లి కోసం ఐశ్వ‌ర్యారాయ్ అభిషేక్‌కు క‌రిష్మా లాగా ఎలాంటి కండిష‌న్స్ పెట్ట‌లేద‌ట‌. పైగా పెళ్లికి ముందే అత్త‌మామలైన అమితాబ్, జ‌య‌ల‌ను బాగా చూసుకుంద‌ట‌. అది చూసి అభిషేక్‌కు ముచ్చ‌టేసి ఎలాగైనా ఐశ్వ‌ర్య‌ను పెళ్లాడాల‌ని భావించాడ‌ట‌. అనంత‌రం అలాగే వారి వివాహం అయింది. అయినా.. పెళ్లిళ్లు స్వ‌ర్గంలో నిర్ణ‌యం అవుతాయంటారు. మ‌ధ్య‌లో మ‌నం మాత్రం ఏం చేస్తాం చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top