“కోహ్లి – కుంబ్లే” వివాదంతో బయటపడ్డ “అభినవ్ బింద్రా, జ్వాలా గుత్తా” ల గురువుల ప్రవర్తన..! ఏమన్నారో తెలుసా..?

ఇటీవ‌లే లండ‌న్‌లో జ‌రిగిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ త‌రువాత భార‌త క్రికెట్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌త కొద్ది రోజులుగా కోచ్ కుంబ్లేకు, కెప్టెన్ కోహ్లికి మ‌ధ్య స‌త్సంబంధాలు లేవ‌ని మొద‌ట తెలిసింది. ఈ క్ర‌మంలోనే కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషించ‌సాగింది. ఇక ట్రోఫీ ముగియగానే తాజాగా కుంబ్లే కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. దీంతో కోహ్లి వ్య‌వ‌హ‌రించిన తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంత‌టి సీనియ‌ర్ ఆట‌గాన్ని లెక్క చేయ‌కుండా కోహ్లి ఇష్టం వ‌చ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం, అందుకు బోర్డు పెద్ద‌లు వ‌త్తాసు ప‌ల‌కం క్రికెట్ అభిమానుల‌కే న‌చ్చ‌డం లేదు. దీంతో చాలా మంది ఇప్పుడు కోహ్లిని విమ‌ర్శిస్తున్నారు. అయితే తాజాగా మ‌రో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే…

కోహ్లి తీరును భారత షూటర్ అభినవ్ బింద్రా కూడా పరోక్షంగా తప్పుబట్టాడు. కోచ్ తో విభేదాలు అంత మంచివి కావనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో తనకు 20 ఏళ్లుగా కోచ్ గా ఉన్న ఉవితో వివాదాన్ని ఇక్కడ బింద్రా ప్రస్తావించాడు. ‘ నేను ఉవితో 20 ఏళ్లపాటు కలిసి పనిచేశాను. నాకు ఏది నచ్చదో అదే అతనే చెప్పేవాడు. దాంతో అతన్ని అసహ్యించుకునే వాడిని. కాకపోతే నా అత్యుత్తమ గురువు అతనే అని కచ్చితంగా చెప్పగలను’ అని బింద్రా పేర్కొన్నాడు.

అభినవ్ బింద్రా ట్వీట్ కు “బ్యాడ్‌మింటన్” ప్లేయర్ “జ్వాలా గుత్తా” స్పదించి..”ట్రైనింగ్ లో అది చాలా ముఖ్యం, నా సార్ కూడా అంతే..!” అని అన్నారు.

 

Comments

comments

Share this post

scroll to top