ఇండియా లో అడుగుపెట్టాక అభినందన్ గారు చెప్పిన మొదటి మాట ఇదే..!!

పాక్ జెట్ ను వెంబడించి ఆ జెట్ ను కూల్చేసి, ప్రమాదం కి గురికాబడి పాకిస్తాన్ జవాన్లకు పట్టుబడ్డ భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ శుక్రవారం భారత గడ్డపై అడుగుపెట్టారు, ఆయన రాకతో అందరు సంతోషించారు, భారతీయలు ఆయనకీ ఘనస్వాగతం పలికారు. జై హింద్ నినాదాలతో ఆయన్ను బ్రహ్మాండంగా స్వాగతించారు.

ఆయన చెప్పిన మొదటి మాట.. :

గుడ్ టు బీ బ్యాక్ అంటూ తన స్పందనను తెలియజేశాడు. అమృత్‌సర్ నగర డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడిన సమయం లో ఈ వ్యాఖ్యలు చేశారు అభినందన్. తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన రాక కోసం ఎంతగానో ఎదురుచూసిన ఆయన కుటుంబీకులు ఆనందం లో మునిగిపోయారు ఆయన తిరిగి వచ్చాక.

వైద్య పరీక్షలు.. :

స్వదేశానికి వచ్చిన అభినందన్‌ను ఇంటిలిజెన్స్ అధికారులు ప్రశ్నించనున్నారు. వైద్యపరీక్షలు కూడా నిర్వహించనున్నామని వాయుసేన అధికారులు తెలిపారు. వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్థాన్ మాకు అప్పగించడం ఎంతో ఆనందం కలిగించింది అని తెలిపారు ఐఏఎఫ్. అభినందన్‌ను వైద్య పరీక్షలకు పంపించనుంది

పాకిస్తాన్ లో అభినందన త్రాగిన టీ బిల్.. :

అయితే అభినందన్ గారు పాకిస్తాన్ లో త్రాగిన టీ బిల్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు, వాళ్ళు డబ్బులు అడగలేదు, బదులుగా ఆయన నడిపిన జెట్ అడిగారు, అభినందన్ నడిపిన MIG-21 జెట్ పేరు ని ధర లో రాసారు. అంటే ఆ టీ ఖరీదు ఆయన జెట్ అనమాట, సోషల్ మీడియా లో ఈ పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఫన్నీ గా ఉన్న ఈ పిక్ ఇప్పడు సర్వత్ర వైరల్ అయ్యింది.

 

Comments

comments

Share this post

scroll to top