అభినందన్‌ విడుదల చేయడానికి మూడు కారణాలివే…

భారత ధీరుడు వైమానిక పైలట్ అభినందన్ వర్థమాన్ ని పాక్ భారత్ కు పంపేందుకు అంగీకరించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అసలు విడుదల చేస్తారా లేదా లేక పోతే భారత్ పాక్ మధ్య యుద్ధం తప్పదా అని చర్చించుకుంటున్న సమయంలో పాకిస్తాన్ ఈ ప్రకటన చేసింది. తాము భారత్ -పాక్ ల మధ్య యుద్ధాన్ని కోరుకోవట్లేదని, శాంతిని కోరుకుంటున్నామని, అందుకే అభినందన్ ని విడుదల చేస్తున్నామని ప్రధాని ఇమ్రాన్ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఇది ఎంత వరకు నిజం అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. అయితే ఈ ప్రకటన వెనక చాలా తతంగమే ఉంది. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి మూలంగానే విడుదల ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.

అభినందన్ విడుదలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా కీలకంగా వ్యవహరించారు. పాక్ అభినందన్ విడుదల ప్రకటన కంటే ముందే ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారత్,పాకిస్థాన్ దేశాల నుంచి గుడ్ న్యూస్ వినబోతున్నామని స్వయంగా ప్రకటించారు ట్రంప్.

యూఎస్ రక్షణశాఖ మంత్రి మైక్ పాంపెయ్, భారత భద్రత సలహాదారు అజిత్ ధోవల్ తో ఫోన్లో దాదాపు అరగంట పాటు మాట్లాడారు. భారత్ కి అత్యంత విశ్వసనియత కలిగిన దేశాలలో ఒకటైన యూఏఈ కూడా పాకిస్థాన్ పై కూడా ఒత్తిడి పెంచింది. సౌదీ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ పాకిస్థాన్ లో కొన్ని రోజుల ముందే పర్యటించారు. వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టడానికి గతంలో ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే భారత్, పాక్ మధ్య యుద్ధం వస్తే పెట్టుబడులు పెట్టేదే లేదని చెప్పారు. ముందే ఆర్థికంగా కొట్టుమిట్టాడుతోంది. ఇక యుద్ధం జరిగితే పెట్టుబడులు రాకపోతే దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని భావించిన ఇమ్రాన్ సౌదీ రాజు ఒత్తిడికి కూడా తలొగ్గారు.

పాకిస్థాన్- చైనా మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. కానీ ఈ విషయంలో భారత్ కి చైనా సపోర్ట్ ఇచ్చింది. దీనికి తోడు చైనా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చైనాలో తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. దింతో పాకిస్థాన్ పై ఉన్న ధోరణిని మార్చుకుంది. భారత్ ప్రదర్శించిన దౌత్యనీతికి ప్రపంచ దేశాలు అండగా నిలిచాయి. పాకిస్థాన్ ఏకాకి అయ్యింది. అన్ని దేశాలు పాకిస్థాన్ పై ఒత్తిడి తేవడంతో అభినందన్ విడుదల ప్రకటన చేసింది పాక్. వేరే గత్యంతరం పాక్ కి లేకపోయింది. ఫలితంగా మన ధీరుడు అభినందన్ వర్ధమాన్ స్వదేశంలో క్షేమంగా వస్తున్నాడు.

Comments

comments

Share this post

scroll to top