అభినందన్ డైలాగ్స్ ని వైరల్ చేస్తున్న పోలీసులు!!

భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలను తరుముతూ వెళ్లిన భారత మిగ్ పైలట్ అభినందన్ వర్థమాన్ ప్రమాదవశాత్తు పాక్ సైనికులకు చిక్కాడు. తమకు దొరికిన శత్రు దేశ సైనికుడి నుంచి రహస్యాలు రాబట్టేందుకు పాక్ విశ్వప్రయత్నాలు చేసింది. చిత్ర హింసలకు గురిచేసింది. అయినప్పటికీ ఏమాత్రం ధైర్యం సడలని అభినందన్ తన పేరు, వివరాలకు మించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

కొన్ని ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడిగిన ఆ వివరాలను చెప్పకూడదని పాక్ ఆర్మీ ముందే ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. వారెంత హింసించినా వివరాలను చెప్పకుండా దేశభక్తిని చాటుకున్నాడు. కోట్లాదిమంది భారతీయులకు హీరో అయ్యాడు. పాక్ సైనికులకు అభినందన్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శం కానుంది. దీని కోసం మహారాష్ట్రలోని నాగ్ పూర్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు.

కొందరు సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారుల పేరుతో ఖాతాదారులకు ఫోన్ చేసి ఓటీపీలను తెలుసుకుని వారి ఖాతాల్లోని సొమ్మును కొల్లగొడుతున్నారు. ఇప్పుడీ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అభినందన్ డైలాగ్స్ ఉపయోగించుకోవాలంటున్నారు పోలీసులు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి ఎవరైనా ఓటీపీ అడిగితే సారి ఆ వివరాలు మీకు చెప్పకూడదు అంటూ సింపుల్ గా బదులివ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. అభినందన్ కూడా తన డైలాగ్స్ ఇంత వైరల్ అవుతాయని అనుకోలేదు కావచ్చు.

Tweet:

Comments

comments

Share this post

scroll to top