సూసైడ్ కి ముందురోజు విజయ్, వనితల మధ్య గొడవ..! ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారో మీరే వినండి..!

విజయ్ సాయి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. తమ కుమారుడి ఆత్మహత్యకు అతడి మాజీ భార్య వనితారెడ్డే కారణమని విజయ్ సాయి తల్లితండ్రులు ఆరోపించిన నేపథ్యంలో వాళ్లిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణాలపై చర్చ జరుగుతోంది. విజయ్ ఒక అమ్మాయితో న్యూడ్‌గా ఉన్న వీడియో వనిత కంట పడడంతో ఆమె అతడికి దూరమైందని, ఆ తర్వాత విడాకులు తీసుకుందని చెబుతున్నారు. అయితే విడాకుల కోసం భర్త నుంచి భారీగా భరణాన్ని డిమాండ్ చేసిందని, అందుకోసమే అతడి కారును కూడా తీసుకెళ్లిందని సన్నిహితులు వెల్లడించారు.

వారిద్దరికీ ఓ పాప ఉందని, ఆ పాప ఎవరి దగ్గర ఉండాలనే విషయంపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని, పాపంటే విజయ్‌కు ఎంతో ఇష్టమని, ఆ పాపను కూడా తన నుంచి వనిత దూరం చేస్తుందని భయపడి మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇది ఇలా ఉండగా సూసైడ్ కి ముందు రోజు విజయ్ సాయి, వనితలు ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏం మాట్లాడుకున్నారో మీరు చూడండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top