ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వికలాంగుడు…ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.? అతని జీవితాన్ని మార్చింది.!

బెంగళూర్ లో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న ఉమేష్, రోడ్ ప్రమాదంలో తన రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు. 5 ఏళ్ళ పాటు మంచానికే పరిమితమయ్యాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి! కుటుంబం గురించి ఆలోచిస్తూ  కళ్ళ వెంట కన్నీళ్లు పెట్టుకునే వాడు. కుటుంబ పోషణ కోసం ఓ చిన్న లాగుడు బండిని ఏర్పాటు చేసుకొని, ఆ బండిపై టీ,కాఫీ,బిస్కెట్స్, చాక్లెట్లు, బ్రెడ్ అమ్ముతూ తన జీవనం సాగించేవాడు. అయినా వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది. బండిని ఒకేచోట ఉంచుకోవడం వలన ఉమేష్ దగ్గరి వస్తువులు  కొనుక్కోడానికి ఎక్కువ మంది  వచ్చే వారు కాదు, అలా అని  ఆ బండిని తోసుకుంటూ అతను వెళ్ళలేడు. ఎలాగో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఉమేష్ జీవితంలో సడెన్ చేంజ్ వచ్చింది. దానికి కారణం ఇద్దరు… ఒకటి సన్నీ స్పెండర్..రెండు హరి వాసుదేవన్. 

sunny1

ఏంటీ సన్నీ స్పెండర్:

ఇది వికలాంగుల కోసం ఏర్పాటు చేయబట్ట చిన్నపాటి ఆటోమేటిక్ వాహనం. దీంతో కస్టమర్ వద్దకే వెళ్లి తన వస్తువులను అమ్ముకుంటున్నాడు ఉమేష్, ఇప్పుడు ఉమేష్ వ్యాపారం చాలా  బాగా సాగుతుంది. గిరాకీ ఉన్న ప్రాంతానికే వెళ్లి తన బిజినెస్ చేసుకుంటున్నాడు. గతంలో అయితే వ్యాపారం జరిగినా,జరగకున్నా ఒక దగ్గరే ఉండేవాడు. ఎవరో ఒకరు ఉమేష్ కు తోడుగా ఉండాల్సి వచ్చేది అప్పుడు. ఇప్పుడా బాధలేదు.   ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ వికలాంగుడే ఇప్పుడు తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలుగుతున్నాడు.

 సన్నీ స్పెండర్ పనిచేసే విధానం: 

వీల్ చైర్ పైన ఒక సోలార్ ప్లేట్ ను అమరుస్తారు. సూర్యుడి కాంతి వలన అది చార్జ్ అవుతుంది. అలా ఛార్జ్ అయిన బండిని మొబైల్ షాపులా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలనుకుతున్నారో అక్కడికి వెళ్ళవచ్చు. అందులో వస్తువులు పెట్టుకునేలా సపరేట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఒకసారి చార్జ్ కావడానికి 8 గంటలు పడుతుంది. ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా చార్జింగ్ చేసుకోవొచ్చు. అలా బ్యాటరీ ఫుల్ అయిన ఈ వాహనాన్ని 45 కి. మీ ప్రయాణం చేయవచ్చు. గంటకు 15 కి.మీ స్పీడుతో నడుస్తుంది.

sunny3

హరి వసుదేవన్ గురించి:
 44 ఏళ్ళ హరి, బిఎస్సి ఫిజిక్స్ చేసి మెకానికల్ ఇంజీనీరింగ్ లో బియి చేశాడు. ఆ తర్వాత ఆటో మొబైల్ ఫీల్డ్ లో ఏడేళ్ళు పనిచేశాడు.  2007 నుండి ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ ను తయారు చేయడం మొదలు పెట్టాడు. ఈ ప్రొడక్ట్ ను కేవలం పేద వికలాంగులను దృష్టిలో పెట్టుకొనే చేశాడు.
sunny2

Comments

comments

Share this post

scroll to top