ఐపీఎల్ లో అతను ఎంతకు అమ్ముడుపోయాడో తెలుసా.? అతని ఆస్థితో ఎన్నో ఐపీఎల్ టీంలు కొనగలడు..!

సుమారుగా.. రూ.4100 కోట్లు.. అంతటి ఆస్తికి వారసుడు ఆ యువకుడు. మరి అన్ని కోట్ల ఉన్న ఆ యువకునికి రూ.30 లక్షలు ఒక లెక్కా చెప్పండి. కాదు కదా.. అయినా అంతే మొత్తానికి పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. పని అంటే.. ఇదేదో ఆఫీస్‌లో అనుకోకండి. క్రికెట్‌ ఆడాలి. అంతే..! ఇటీవలే ఐపీఎల్‌ సీజన్‌ 11 టోర్నమెంట్‌ కోసం ఆటగాళ్ల వేలం నిర్వహించారు కదా. అందులో కొందరు ఆటగాళ్లు భారీ మొత్తంలో ధర పలికారు. కానీ కొందరు మాత్రం అమ్ముడుపోలేదు. ఇక కొందరు ప్రముఖ ఆటగాళ్లు కనీస ధరకే అమ్ముడుపోయారు. అయితే మరి కొందరు యువ ఆటగాళ్లు కూడా ఈ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో పైన చెప్పిన ఆ యువకుడు కూడా ఉన్నాడు. అతనే ఆర్యమాన్‌ బిర్లా. వయస్సు 20 సంవత్సరాలు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా కుమారుడు అతను.

వేల కోట్ల ఆస్తి పరుడైనా ఆర్యమాన్‌ బిర్లాకు మాత్రం క్రికెట్‌ అంటేనే ఆసక్తి ఉండేది. అందులో భాగంగా చిన్నతనం నుంచే అందులో కోచింగ్‌ తీసుకోవడం మొదలు పెట్టాడు. క్రికెట్‌లో ప్రతిభ చాటడం ప్రారంభించాడు. ఇతను లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెనే కాదు, లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ కూడా. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో ఆల్‌ రౌండర్‌గా సత్తా చాటుతున్నాడు. జాతీయ స్థాయి టోర్నమెంట్‌ అయిన పాలీ ఉమ్రీగర్‌ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. మధ్యప్రదేశ్‌ జట్టులో ఇతను ఓ ఆటగాడు. ఆ జట్టు తరఫున మ్యాచ్‌లు ఆడి సత్తా చాటాడు. అండర్‌ 23 మధ్యప్రదేశ్‌ జట్టులో ఆడి 602 పరుగులు సాధించాడు. అందులో రెండు సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ ఉన్నాయి. ఇక లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌గా 10 వికెట్లు కూడా తీశాడు. దీంతో ఐపీఎల్‌ టోర్నమెంట్‌ తలుపు తట్టాడు.

ఇటీవలే నిర్వహించిన ఐపీఎల్‌ సీజన్‌ 11 టోర్నమెంట్‌ వేలం పాటలో ఆర్యమాన్‌ బిర్లా కూడా ఉన్నాడు. ఇతని కనీస ధరను ఐపీఎల్‌ కమిటీ రూ.20 లక్షలుగా నిర్ణయించింది. అయితే తొలి రోజు జరిగిన వేలం పాటలో ఇతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఆర్యమాన్‌ కొంత నిరాశ చెందాడు. అయితే రెండో రోజు ఇతని పంట పండింది. రూ.30 లక్షలకు ఇతన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ టీం కొనుగోలు చేసింది. దీంతో ఆర్యమాన్‌ తెగ ఆనంద పడిపోయాడు. అసలు ఏదైనా ఒక టీం తనను కొనుగోలు చేస్తే చాలని, తరువాత నెమ్మదిగా జట్టులో ఆడే చాన్స్‌ పొందవచ్చని అతను అనుకున్నాడు. అదే జరిగింది. దీంతో త్వరలో జరగనున్న ఐపీఎల్‌ టోర్నీలో ఇతను రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తరఫున ఆడనున్నాడు. అందులో ఉన్న స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌, ఆజింక్యా రహానే వంటి ప్రముఖ ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోనున్నాడు. ఈ క్రమంలో ఫైనల్‌ జట్టులో స్థానం దక్కుతుందనే ఆశతో ఆర్యమాన్‌ ఎదురు చూస్తున్నాడు. అతని కల నెరవేరాలని మనమూ ఆశిద్దాం. ఏది ఏమైనా.. ఎన్ని కోట్లు ఉన్నా మనస్సుకు నచ్చిన పని చేస్తేనే కదా.. ఆత్మ సంతృప్తి వచ్చేది. ఆర్యమాన్‌ ఇప్పుడు చేస్తున్నది అదే కదా..!

Comments

comments

Share this post

scroll to top