ఆరోజు ఇషాకు ఆ సమస్య రాకపోతే JIO ఉండేదే కాదు.! ఆ సమస్య ఏంటో తెలుసా.?

జియో రాక‌ముందు ఒక‌ప్పుడు మ‌నం మొబైల్ ఇంట‌ర్నెట్ విష‌యంలో ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నామో అంద‌రికీ తెలిసిందే. ఇప్పటి క‌న్నా అధిక ధ‌ర‌ల‌కు మొబైల్ ఇంట‌ర్నెట్ డేటా ప్లాన్‌లను వాడాల్సి వ‌చ్చేది. అంత వాడినా నెట్ స్పీడ్ స‌రిగ్గా ఉంటుందా అంటే అదీ లేదు. కానీ జియో రాక‌తో ఈ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే మ‌న‌కు ఇప్పుడు హై స్పీడ్ 4జీ మొబైల్ ఇంట‌ర్నెట్ డేటా ల‌భిస్తోంది. అయితే నిజానికి జియో ఆవిర్భావం వెనుక ఉన్న‌ది ఎవ‌రో తెలుసా..? ఇంకెవ‌రు.. ముఖేష్ అంబానీయే క‌దా.. అంటారా.. అయితే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే జియో రావ‌డం వెనుక ఉన్న వ్యక్తి ముఖేష్ అంబానీ కాదు, ఆయ‌న కూతురు ఇషా అంబానీ..

అవును మీరు విన్న‌ది కరెక్టే. అస‌లు జియో వ‌చ్చేందుకు కార‌ణం ముఖేష్ అంబానీ కాదు, ఆయ‌న కూతురు ఇషా అంబానీ. ఈ విష‌యాన్ని ముఖేష్ అంబానీయే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఆయ‌న ఏం చెప్పారంటే… ఓ సారి ఇషా అంబానీ సెల‌వుల కోసం ముంబైలోని త‌మ ఇంటికి వ‌చ్చింద‌ట‌. అప్పుడు త‌న‌కు ఏదో ప్రాజెక్ట్ ప‌ని నిమిత్తం ఇంట‌ర్నెట్ అవ‌స‌రం అయింద‌ట‌. కానీ అప్పుడు నెట్ క‌నెక్టివిటీ స‌రిగ్గా లేద‌ట‌. దీంతో ఇదే విష‌యంపై ఆలోచించిన ఇషా అంబానీ త‌న సోద‌రుడు ఆకాష్ అంబానీతో క‌లిసి త‌మ తండ్రి ముఖేష్ వ‌ద్ద‌కు వెళ్లి ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ గురించి చెప్పార‌ట‌. దేశంలో ప్ర‌జ‌లు సాంకేతికంగా బాగా వెనుక‌బ‌డ్డార‌ని, ఇప్ప‌టికీ ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ స‌రిగ్గా లేద‌ని, క‌నుక మ‌నం క‌చ్చితంగా ప్ర‌జ‌ల‌కు హై స్పీడ్ ఇంట‌ర్నెట్‌ను అందించాల‌ని వారు ముఖేష్ కు చెప్పార‌ట. దీంతో ముఖేష్ ఆలోచించి జియోను ప్రారంభించార‌ట‌. అదీ.. జియో ఆవిర్భావం వెనుక ఉన్న అస‌లు క‌థ‌.

త‌రువాత సెప్టెంబర్ 2016 లో జియో ప్రారంభ‌మైంది. త‌రువాత ఏమైందో అంద‌రికీ తెలుసు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ట్టుకునే ప్లాన్ల‌తో వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువ అయింది. వాయిస్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌కు ఎలాంటి రుసుం వ‌సూలు చేయ‌డం లేద‌ని, కేవ‌లం మొబైల్ ఇంట‌ర్నెట్ డేటాకు మాత్ర‌మే చార్జి చేస్తామ‌ని చెప్ప‌డంతో జియో నెట్‌వ‌ర్క్‌పై చాలా మంది క‌స్ట‌మ‌ర్ల‌కు ఆస‌క్తిని పెంచుకున్నారు. అధిక శాతం మంది జియోను వాడ‌డం మొద‌లు పెట్టారు. అలా జియో క్ర‌మ క్ర‌మంగా వృద్ధిలోకి వ‌చ్చింది. 2019 క‌ల్లా 4జీ నెట్‌వ‌ర్క్‌లో భార‌త్‌ను అగ్ర స్థానంలో నిల‌ప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ముఖేష్ అంబానీ వెల్ల‌డించారు. అతి త్వ‌ర‌లో 5జీ సేవ‌ల‌ను కూడా జియో అందించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఏది ఏమైనా మ‌న‌కు ఇప్పుడు చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే 4జీ మొబైల్ డేటా ల‌భిస్తున్న‌దంటే అదంతా జియో పుణ్య‌మే అని చెప్ప‌వ‌చ్చు క‌దా.

Comments

comments

Share this post

scroll to top