బ‌స్సులో అత‌ను ఆమెకు నీలి చిత్రాలు చూపించాడు…అందుకు ఆమె అత‌నికి ఎలా బుద్ధి చెప్పిందో తెలుసా..?

దేశంలో రోజు రోజుకీ ఈవ్ టీజ‌ర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. వారి బెడ‌ద కూడా అంతే స్థాయిలో ఎక్కువైంది. ఎక్క‌డ చూసినా ఈవ్ టీజ‌ర్లు మ‌హిళ‌ల‌ను వేధించిన ఘ‌ట‌న‌లను మ‌నం నిత్యం చూస్తూనే ఉన్నాం. వాటిని పేప‌ర్ల‌లో చ‌దువుతూనే ఉన్నాం. అయిన‌ప్ప‌టికీ ఈవ్ టీజ‌ర్లు మ‌రింత రెచ్చిపోతున్నారే త‌ప్ప ఆ ప‌ని చేయ‌డం మాన‌డం లేదు. అయితే ఈవ్ టీజ‌ర్ల వేధిస్తున్న‌ప్పుడు సాధార‌ణంగా ఏ మ‌హిళ అయినా భ‌య‌ప‌డుతుంది. కానీ ఆ యువ‌తి మాత్రం అలా కాదు. త‌న‌ను ఈవ్ టీజింగ్ చేసిన వ్య‌క్తికి, త‌న‌కు అస‌భ్య ఫొటోలు చూపించిన అత‌నికి గ‌ట్టిగా బుద్ధి చెప్పింది. ఈ ఘ‌ట‌న జ‌రిగింది కోల్‌క‌తాలో..!

కోల్‌క‌తాలో నివాసం ఉండే అన‌న్య చ‌ట‌ర్జీ బ‌స్సులో త‌న ఇంటికి వెళ్తుండ‌గా ఓ వ్య‌క్తి ఆమె వెనుక సీట్‌లో వ‌చ్చి కూర్చున్నాడు. అయితే అత‌ను అంత‌టితో ఆగ‌లేదు. త‌న ఫోన్ లో ఉన్న బూతు చిత్రాల‌ను, బ్లూ ఫిలింల‌ను ముందు సీట్లో ఉన్న అన‌న్య‌కు చూపించ‌డం మొద‌లు పెట్టాడు. ఓ ద‌శ‌లో ఆమె పక్క‌న సీటు ఖాళీ అవ‌గా అత‌ను వెనుక సీట్లోంచి లేచి ఆమె ప‌క్క‌న వ‌చ్చి కూర్చున్నాడు. దీంతో అత‌ను మ‌రింత రెచ్చిపోయాడు. చాలా సేపు అలా బూతు బొమ్మ‌ల‌ను చూపిస్తూనే ఉన్నాడు. దీనికి తోడు అన‌న్య వైపు చూస్తూ అస‌భ్య‌కర రీతిలో సైగ‌లు చేశాడు.

అయితే.. అన‌న్య ఇక ఓపిక ప‌ట్ట‌లేక‌పోయింది. వెంట‌నే ఆ వ్య‌క్తి జుట్టు ప‌ట్టుకుని పైకి లేపి అత‌ని వృషణాల మీద ఒక్క కిక్ ఇచ్చింది. అంతే.. ఆ వ్య‌క్తి గిల గిలా కొట్టుకుని కింద‌ప‌డ్డాడు. అనంత‌రం అన‌న్య అత‌న్ని చెడా మడా తిడుతూ తంతూనే ఉంది. దీంతో బ‌స్సును డ్రైవ‌ర్ పోలీస్ స్టేష‌న్‌కు పోనిచ్చాడు. అయితే పోలీస్ స్టేష‌న్ ముఖం చూశాక ఆ వ్య‌క్తి త‌న‌ను క్ష‌మించ‌మ‌ని వేడుకున్నాడు. అత‌ని భార్య కూడా అక్క‌డికి వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ అన‌న్య అత‌న్ని విడిచి పెట్ట‌లేదు. అత‌న్ని త‌న్నినంత సేపు త‌న్ని చివ‌ర‌కు పోలీసుల‌కు అప్ప‌గించింది. దీంతో పోలీసులు ఆ వ్య‌క్తిపై కేసు న‌మోదు చేశారు. ఏది ఏమైనా అన‌న్య చేసిన ప‌నికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలా అంద‌రూ చేస్తే అప్పుడు ఏ వెధ‌వ ఈవ్ టీజింగ్ చేయ‌డానికి కూడా సాహసించ‌డు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top