జయలలిత – శోభన్ బాబు ప్రేమకు ఆ మహిళ చిహ్నం అంట..! “జయ నా కన్నతల్లి” అని డిఎన్ఏ పరీక్షకు సిద్ధం!

‘మాజీ ముఖ్యమంత్రి జయలలిత నా కన్నతల్లి. తను తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో శోభన్‌బాబు అండతో కోలుకుంది. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమాప్యాయలతకు గుర్తే నేను. అయితే వివిధ కారణాల వల్ల వివాహం చేసుకోలేదు. దీంతో నన్ను జయ సోదరి శైలజ, భర్త సారథిలకు అప్పగించారు. అయితే నేను ఎవరన్న విషయం ఎవరికీ చెప్పొద్దని వారితో ఒట్టు వేయించుకున్నారు. 1996లో శైలజ సూచన మేరకు జయను కలిస్తే వివరాలు తెలుకుని నన్ను ఒక్కసారిగా హత్తుకున్నారు. అయితే ఆమె నా తల్లి అన్న విషయాన్ని ఆమె ఎప్పుడూ చెప్పలేదు’ అంటూ అమృత అనే మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. బెంగళూరుకు చెందిన ఆ మహిళ తాను జయలలిత కూతురినని నిరూపించుకునేందుకు డీఎన్‌ఏ పరీక్షలకు సైతం సిద్ధమంటుంది. మరోవైపు, జయలలితది సహజ మరణం కాదని, నిజాలను రాబట్టేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్‌ తదితరులకు ఆమె రాసిన లేఖలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి.

ఆ లేఖలో ఉన్న సారాంశం ఇదే:

జయలలిత తన అమ్మానాన్నలను కోల్పోయి మానసికంగా కుంగిపోయిన దశలో అలనాటి తెలుగు సినీ హీరో శోభన్‌బాబు సహకారంతో కోలుకుంది. ఆ సమయంలో వారిద్దరి ప్రేమకు గుర్తుగా నేను(అమృత) పుట్టాను. సామాజిక కట్టుబాట్ల కారణంగా వారి వివాహం జరగలేదు. బెంగళూరులో ఉంటున్న జయలలిత సోదరి శైలజ, భర్త సారథిలకు నన్ను అప్పగించారు. తన కుమార్తెననే విషయం చెప్పొద్దని వారితో ఒట్టు వేయించుకుంది నా తల్లి జయలలిత.

1996లో జయను కలవమని నన్ను పెంచిన తల్లి శైలజ సూచించారని, ఆమెను కలిసినపుడు తనను చూడగానే జయ తన వివరాలు కనుక్కొని ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నారని చెపుతుంది అమృత. ఆ తర్వాతా అనేకసార్లు కలిశా. తానే నీ తల్లినని ఆమె తనతో ఎన్నడూ అనలేదు. జయ మరణం తర్వాత దీప, దీపక్‌లు ఆమె ఆస్తులకు వారసులమని చెబుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను చూసి, అమెరికాలో ఉన్న తమ బంధువైన జయలక్ష్మి తనకు ఫోన్‌ చేసి జయ సంతానం తానే అని చెప్పారు అని వివరించింది అమృత. బెంగళూరులో ఉంటున్న మరో బంధువు సైతం ఇదే మాట చెప్పారు. నా తల్లిని కొంతమంది కుట్రచేసి చంపారు. వారిలో అన్నాడీఎంకే నాయకురాలు శశికళ, నటరాజన్‌లు ముఖ్యులు’ అని అమృత ప్రధాని, రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Comments

comments

Share this post

scroll to top