హైదరాబాద్ వచ్చిన “ఇవంక ట్రంప్” లో ఈ కోణాన్ని ఎవ్వరు చూడలేకేపోయాం..! ఇది చూస్తే ఫిదా అవ్వక తప్పదు!

ఇవాంక భాగ్యనగరానికి రావడం వెళ్లిపోవడం జరిగాయి..ఆమె అందాన్ని పొగుడుతూ కొందరు కవితలు రాస్తే..మరికొందరు ఆమె ముగ్గురు పిల్లల తల్లీ అంటూ ఫోటోలు పెట్టారు..ఏదేమైనా ఒక స్త్రీని మనం ఏ దృష్టితో చూస్తున్నామన్నది ఇవాంక విషయంలో స్పష్టంగా అర్దమైపోయింది..ఆమెని అమ్మగా చూసిన వారికంటే అందమైన స్త్రీగా చూసినవారే ఎక్కువమంది…. ఇక్కడ ఇవాంక గురించిన ఒక ఆసక్తికరమైన విషయం కనపడింది..

ఇవాంకలో నాకు ఒకమంచి అమ్మ కనపడింది అని ఒకరురాసిన పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..అది చదివాక ఇవాంక ఫోటోస్ చూస్తే మనకు అదే అనిపిస్తుంది.ఎందుకంటే ఆమె తన కుటుంబంతో ఉన్న ప్రతి ఫోటోలో తన పిల్లల్ని తనే ఎత్తుకుంది..ఇది చాలా సాధారణ విషయంలా లేదంటే ఏదో ఫోటోలకు ఫోజులకోసం ఇలా చేసినట్టుగా అనిపించొచ్చు..కానీ ప్రతి ఫోటోని క్షుణ్నంగా పరిశిలిస్తే అర్దం అవుతుంది అవి ఫోటోలకు మాత్రమే పరిమితమైన ప్రేమ కాదని… ఆమెకి ఉన్న స్టేటస్ కి ఆమె పిల్లల్ని ఎత్తుకోవడానికి ఎంతోమంది పనివాళ్లను పెట్టుకోవచ్చు…

అంతెందుకు మన దగ్గరే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నామన్న కారణంతో పిల్లల్ని చూసుకోవడానికి డే కేర్ లో వేయడమో, ఆయాలకు అప్పగించడమో చేస్తున్నాం,వారి ఆలనా పాలనా అంతా చూసేది వారే..బయటికి పిల్లల్ని తీసుకుని వెళ్లినా కూడా వారిని ఎత్తుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ పనివాళ్లను పెట్టుకునే స్థితిమంతులు మనదగ్గరా,వివిద దేశాల్లో చాలామందే ఉన్నారు.వారందరితో పోలిస్తే ఇవాంక ఆకాశం అంత ఎత్తున కనిపిస్తుంది…

ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్ కూడా ఆరాధ్యని ఎప్పుడూ ఎత్తుకునే ఉంటుంది.దాన్ని కూడా మన మీడియా ఆరాధ్యకి ఏమన్నా ఆరోగ్యలోపం ఉందా అని వార్తలా ప్రచారం చేస్తే..అప్పుడు ఐశ్వర్యే స్వయంగా వివరణ ఇచ్చింది పెద్దయ్యాక ఎలాగూ తనే నడుస్తుంది కదా..ఇప్పుడు నా కూతుర్ని ప్రేమారా ఎత్తుకుంటున్నా అని…ఇవాంకా అయినా, ప్రపంచసుందరి అయినా అమ్మ అమ్మే అని నిరూపించారు.

 

Comments

comments

Share this post

scroll to top