ఆ కారులో ఎవరున్నారో తెలుసా..? అంతమంది రావడానికి కారణం తెలుస్తే షాక్ అవుతారు..!

ఒక స్టార్ హీరో.. లేదంటే ఒక స్టార్ హీరోయిన్.. ఇంకా మాట్లాడితే జనంలో బాగా పేరున్న ఓ రాజకీయ నాయకుడు ఒక ప్రాంతానికి వెళ్తే ఎంత మంది వస్తారు? బాగానే వస్తారనుకోండి. దానికి కొన్ని రెట్ల జనం.. బాలీవుడ్ బ్యూటీ సన్నిలియోన్‌ని చూడటానికి వచ్చారు. ఆ ప్రాంగణం అంతా జనసంద్రంలా మారిపోయింది. ఆమె రాక ఆలస్యమవుతుందని తెలిసినా గంటల తరబడి అంత జనం అలాగే ఎదురు చూస్తూ ఉండిపోయారు. ఆమెకు కేరళ ప్రజలు ఘన స్వాగతం పలికారు.

సన్నీ ఒకప్పుడు పోర్న్ స్టార్… ఆ తర్వాత బాలీవుడ్ లోకి వచ్చి తన పాత జీవితానికి స్వస్తి చెప్పేసింది. కానీ ఇప్పటికీ ఆమె అవమానాలకు గురవుతూనే ఉందట. ప్రస్తుతం సన్నీకి ఎంత డిమాండ్ ఉందంటే.. ఫిల్మ్ మేకర్స్ ఆమె కాల్ షీట్ల కోసం ఎగబడుతున్నారు. ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంటే కూడా నేమ్, ఫేమ్ సంపాదించి చాలా బిజీగా మారింది.

కొచ్చిలో ఓ మొబైల్ షోరూం ఇనాగ‌రేష‌న్ కోసం వెళ్లిన స‌న్నీని చూసేందుకు జ‌నాలు ఇసుకేస్తే రాలనంతగా త‌ర‌లి వ‌చ్చారు. ఆ జనసంద్రాన్ని చూసిన సన్ని అవాక్కయిందట. కొచ్చి ప్రజలు చూపించిన ప్రేమకు నేను ధన్యురాలిని. వారి ప్రేమను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను అంటూ ఓ కామెంట్‌తో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సన్ని.

watch video here:

Comments

comments

Share this post

scroll to top