ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడు ఫేస్బుక్ లో మొత్తం ఈ అమ్మాయి గురించే ఎందుకంటే..!

కేరళలో ఇప్పుడంతా మమ్మల్ని అరెస్టు చేయండి ప్లీజ్ అంటూ క్యూ కడుతున్నారు. అయితే వీళ్లెవరూ ఏ స్టేషన్ పడితే ఆ స్టేషన్ కు వెళ్లట్లేదు. కేవలం కొచ్చి ఏసీపీ వద్దకు మాత్రమే అరెస్టు చేయాలంటూ వెళ్తున్నారు. ఎందుకంటే.. మెరిన్ జోసెఫ్ అనే ఐపీఎస్ అధికారిణి అక్కడ ఏసీపీగా ఇటీవలే ఛార్జి తీసుకున్నారు.

ఇప్పుడు ఆమె ఫొటోను ఫేస్‌బుక్ లో విపరీతంగా షేర్ చేస్తూ.. మమ్మల్ని అరెస్టు చేయండి అంటూ కోరుతున్నారు. మెరిన్ జోసెఫ్ అందంగా కనపడటమే అందుకు కారణం. ఆమె చేతుల్లో అరెస్టు కావడానికి తాము దొంగలుగా మారేందుకు కూడా అభ్యంతరం లేదని కొంతమంది చెబుతున్నారు.

కొచ్చి కొత్త ఏసీపీగా మెరిన్ జోసెఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పౌర సమస్యలకు సంబంధించిన ఓ ఫేస్‌బుక్ పేజీలో ఆమెకు స్వాగతం పలుకుతూ ఫొటో పోస్ట్ చేశారు. కేవలం ఒక్కరోజులోనే ఆ ఫొటోకు ఏకంగా పదివేల లైకులు వచ్చాయి. షేర్లు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. వాట్సప్ లో కూడా ఈ ఫొటోను విస్తృతంగా షేర్ చేసుకున్నారు.

నిక్కీ అనే ఓ కుర్రాడు తాను దోపిడీలు మొదలుపెట్టేస్తానని బహిరంగంగా చెప్పాడు. ”వావ్!! ఇంత అందమైన పోలీసు ఆఫీసర్ కొచ్చిని పాలిస్తుంటే చూడటానికి చాలా సంతోషంగా ఉంది. మీకు అభినందనలు!” అని పెట్టాడు. తనను అరెస్టు చేయాలంటూ ప్రముఖ నటుడు మోహన్ లాల్ ఆమెను అడుగుతున్నట్లుగా ఫోటాషప్ లో మార్ఫింగ్ చేసిన ఫొటో కూడా ఫేస్‌బుక్ లో విస్తృతంగా వ్యాపించింది.

Comments

comments

Share this post

scroll to top