ఆమె “సీఎం” చెల్లెలు…కానీ “టీ” అమ్ముకొని బతుకుతుంది..! ఎందుకో తెలుసా.? ఇంతకీ ఆ సీఎం ఎవరు?

మన ఇంట్లో బీట్ కానిస్టేబుల్ ఉంటే అతని పేరు చెప్పుకుని ఓ తెగ బిల్డప్ ఇస్తుంటాం..అలాంటిది ఏ ఎమ్మెల్యేనో ,ఎంపి నో ఉంటే ఇక మన ఆర్బాటాలకు హద్దుండదు..వాళ్ల పేర్లు చెప్పుకుని ప్రతి పని జరిపించుకోవాలనుకుంటాం..అలాంటిది సిఎం కి చెల్లెలు అయినప్పుడు ఆమె ప్రవర్తన  ఇంకే విధంగా ఉంటుంది..చెప్పాల్సిన పనిలేదుకదా..కాని చెప్పాలి .ఎందుకంటే ఇక్కడ సిఎం మా అన్నయ్య అంటూ ఆ చెల్లి కనపడిన ప్రతొక్కరికి చెప్పట్లేదు కాబట్టి..అంతేకాదు తన అన్న పలుకుబడి ఉపయోగించుకుని లాభాలు పొందట్లేదు కాబట్టి..మరింతకు ఆ చెల్లి ఏం చేస్తుంది..ఇంతకీ తన అన్న ఎవరు?

ఆ అన్నా, చెల్లెళ్లు ఎవరో కాదు.. ఉత్తర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్‌.. ఆయన చెల్లి శశిపాయల్‌. యోగి ముఖ్యమంత్రిగా పదవి బాధ్య‌త‌లు చేపట్టి సంవ‌త్స‌రం గ‌డిచిపోయింది. గతంలోనూ ఎంపీగా చాలా ఏళ్ల పాటు పనిచేశారు. కానీ ఆయన చెల్లెలు శశిపాయల్‌.. మాత్రం గత 23 ఏళ్లుగా ఉత్తరాఖండ్‌లోని కోఠార్‌ గ్రామంలో చిన్న టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.ఆమె భర్త కూడా అక్కడే ఓ చిన్న పూజా సామగ్రి దుకాణం న‌డుపుకొంటున్నారు. అన్న ముఖ్యమంత్రి అయినా దర్పం ప్రదర్శించకుండా అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న శశిపాయల్‌ను చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ కుటుంబంలో అన్న‌ముఖ్య‌మంత్రి అయినా..చెల్లెలు మాత్రం ఎప్ప‌టిలాగే సాధార‌ణ జీవితం గ‌డ‌ప‌డం చాలా అరుదు అని ప్ర‌జ‌లు చెప్పుకొంటున్నారు.

యోగి ఆదిత్యానాధ్ చెల్లెలే కాదు..తండ్రి కూడా సాధారణ జీవితమే గడుపుతున్నారు.గతంలో ఒక సారి తన మనవరాళ్లని క్యాంపస్ ఇంటర్యూలో పాల్గొనేందుకు ఆటోలో తీసుకురావడమే కాదు..సిఎం మేనకోడళ్లు కదా అని అక్కడ అధికారులు మర్యాదలు చేయబోతే సున్నితంగా తిరస్కరించారు..అందరితోపాటుగా తన మనవరాళ్లకు ఇంటర్వ్యూ నిర్వహించాలని సదరు అధికారులను కోరారు..

Comments

comments

Share this post

scroll to top