ద‌య‌చేసి ఏ ఆహార ప‌దార్థం తింటూ ఈ వార్త చ‌ద‌వ‌కండి…. ఎందుకంటే ఇది చదివాక మీరు ఫుడ్ తినడానికే ఇష్టపడరు…

ప్ర‌పంచం మొత్తంలోనే అస‌హ్యం వేసే ఫుడ్ ఐటెమ్స్ ఇవి.మన వరకు నోరూరించే వంటకం అంటే ముద్దపప్పు,ఆవకాయ్,పప్పు చారు..అంతకు మించి కావాలనుకుంటే తందూరి చికెన్, ప‌న్నీర్ టిక్కా, బేల్ పూరి, పావు భ‌జ్జీ, వ‌డ పావ్, ఆలూ చాట్ అంత క‌న్నా కావు… కానీ మనం కలలో కూడా ఊహించని ఐటమ్స్ కొన్ని దేశాలలో వారికి నోరూరించే ఐటెమ్స్ అవేంటో ఒకసారి చదవండి..చదివాక మమ్మల్ని తిట్టుకోవద్దే…ఎందుకంటే ముందే చెప్పాం తింటూ చదవొద్దని,చదివితే ఇక ఏ ఫుడ్ జోలికి వెళ్లరని..

పులియ‌బెట్టిన షార్క్ క‌ళేబ‌రం వంట‌కం

యూర‌ప్ కంట్రీ ఐస్ లాండ్ లో దీన్ని లొట్ట‌లేసుకుంటూ తింటార‌ట‌. కుళ్లిపోయిన షార్క్ క‌ళేబ‌రాన్ని పులియ‌బెట్టి త‌ర్వాత ఇలా ఫ్రై చేసి అమ్ముతార‌ట‌. దీన్నే హ‌క‌ర్ల్ అని అంటారు.

ఫ్రైడ్ బ్రెయిన్ సాండ్ విచ్

ఇవి యూఎస్ లో తెగ ఫేమ‌స్ ఇంతకీ ఇది దేని మెద‌డు చెప్ప‌లేదు క‌దు.. పంది మెద‌డు అది. చాలా మంది లివ‌ర్, కిడ్నీ సాండ్ విచ్ ల‌ను త‌యారు చేస్తారు కాని.. ఇది ఫ్రైడ్ బ్రెయిన్ సాండ్ విచ్. కాని.. మొద‌డుతో చేయ‌డ‌మేంటి విచిత్రం కాక‌పోతే..

రాకీ మౌంటెన్ ఓయిస్ట‌ర్స్

కెన‌డాలో తెగ ఫేమస్ అయిన రాకీ మౌంటేన్ ఓయిస్టర్స్ దేనితో చేస్తారో తెలుసా… ఎద్దు, పంది, గొర్రె వృష‌ణాల‌తో చేసే వంట‌కం అది.

ఎండ‌బెట్టిన బ‌ల్లులు

ఛీ యాక్ ..మ‌నం  ఇంట్లో బ‌ల్లుల‌ను చూస్తేనే ఎగిరి గంతేస్తాం..అలాంటిది వీళ్లు అవే బ‌ల్లుల‌ను మాంచిగా ఎండ‌బెట్టుకొని ఫ్రై చేసుకొని తింటారు.చైనాలో ఈ వంట‌కానికి భ‌లే గిరాకి.

పురుగుల చాకోలేట్

పోలాండ్ లో ఇన్ సెక్ట్ చాకోలేట్ తెగ ఫేమ‌స్. చాకోలేట్ లో ఎవ‌రైనా డ్రై ఫ్రూట్స్, న‌ట్స్ వేసుకొని తింటారు. వీళ్లు మ‌త్రం పురుగులను క‌లుపుకొని లాగించ‌స్తారు.. ద్యావుడా…

టూనా ఫిష్ క‌ళ్లు

టూనా ఫిష్ క‌ళ్ల‌ను క‌ళ్ల‌క‌ద్దుకొని మ‌రీ తింటార‌ట జ‌ప‌నీయులు. అది ఫ్రై చేసుకొని తింటార‌ని అనుకుంటున్నారా? ప‌చ్చి క‌ళ్ల‌ను అలాగే పీక్కుతింటారట‌… ఓరి దేవుడోె…

మిడుత ఫ్రై

ఆకుప‌చ్చ రంగులో అక్క‌డ ఇక్క‌డ ఎగురుతూ ఉంటుందే అదే మిడుత‌. దాని ఫ్రై నే లొట్ట‌లేసుకుంటూ తింటార‌ట చైనీయులు, థాయిలాండ్ వాసులు.

.చిన్న రొయ్యలు (డ్రంకెన్ ష్రింప్స్)
ఎహె… రొయ్య‌లైతే మేము కూడా లొట్ట‌లేసుకుంటూ తింటామంటారా? అయితే.. ముందు ఇది కూడా చ‌ద‌వండి… ఆ రొయ్య‌ల‌ను వాళ్లు కూర వండ‌రు. అలాగే ప‌చ్చియే తింట‌రు. అదే ఈ డ్రంకెన్ ష్రింప్స్ స్పెషాలిటి.

ఎలుక‌ల ఫ్రై

ఆ… ఎలుక‌ల ఫ్రై. ఇది కూడా చైనీయుల వంట‌క‌మే. ఎలుక‌ల ఫ్రై ను మందులో మంచింగ్ గా తింటే ఉంటుంద‌ట నా సామిరంగా(చైనీయుల‌కు)….మనకు కాదులెండి

స‌న్నాక్జి.. రా ఆక్టోప‌స్

రా ఆక్టోప‌స్ అంటే… ప‌చ్చి ఆక్టోప‌స్ అన్నమాట‌. ఆక్టోప‌స్ మంచి టేస్టే ఉంటది. కాని.. ప‌చ్చి ఆక్టోప‌స్ ఏందిరా బాబు… అది ర‌బ్బ‌రు లా ఉంట‌ది క‌దా. దాన్ని ఎట్లా తింటారు రా నాయ‌నా… కొరియాలో రెస్టారెంట్ల ముందు క్యూలు క‌ట్టి మ‌రీ తింటార‌ట ఈ వంట‌కాన్ని.

పిండంగా ఉన్న బాతు గుడ్డు ను ఉడ‌క‌బెట్టి తినే రెసిపీ

బాతు గుడ్డును పొదిగిన కొన్ని రోజుల త‌ర్వాత అంటే.. ఆ గుడ్డులో సగం పిల్ల త‌యారైన త‌ర్వాత ఆ గుడ్డును ఉడ‌క‌బెట్టి దాని పొట్టు తీసి ఆ స‌గం త‌యారైన పిల్ల‌తో త‌యారు చేసే వంట‌కం అది. చదువుతుంటే కడుపులో తిప్పుతుందా..

స్పైడ‌ర్ ఫ్రై

సాలెపురుగుల ఫ్రై ఇది… సాలెపురుగుల‌ను చూస్తేనే ఏదోలా ఉంటుంది. వాటి ఫ్రై అంటే.. అమ్మో..

ప‌క్షి గూడు సూప్

ఈ వంట‌కం కూడా చైనాలోనే ఫేమ‌స్. అయితే.. పేరుకు ప‌క్షి గూడు సూప్. కాని.. ఇది ప‌క్షి నోటి కార్చే చొంగ‌, సొల్లు తో త‌యారు చేసిన సూప్….

 జడలబర్రె మ‌ర్మాంగంతో చేసిన వంట‌కం

జ‌డ‌ల బర్రె పెన్నిస్ ను మంచి గా ఫ్రై చేసి.. గార్నిష్ చేసి మ‌రీ వ‌డ్డిస్తార‌ట‌.

Comments

comments

Share this post

scroll to top