రాత్రి 12 కి సాధారణ మహిళ లాగా బాస్ స్టాప్ లో నించుంది ఆ డీసీపీ…ఇంతలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి!

ఆడది అర్దరాత్రి రోడ్డుపై తిరగగలిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టని గాంధి చెప్పారు..ఇప్పుడు కేరళలోని కోజికోడ్ డిసిపి నిజంగా ఆడవాళ్లకు సేఫ్టీ ఉందా..నైట్ టైం ఏ భయం లేకుండా తిరగగలుగుతున్నారా అనేది స్వయంగా తెలుసుకోవాలనుకుంది..దానికోసం అండర్ కవర్ ఆఫరేషన్ చేపట్టి,ఇద్దరు లేడి కానిస్టేబుల్స్ ని తీసుకుని బయలుదేరింది… ఒక నైట్ అంతా ఆమె కోజికోడ్ రోడ్లవెంట తిరిగి సమస్యలు గుర్తించిన ఆమె డిసిపి మెహరీన్.ఈ అండర్ కవర్ ఆఫరేషన్ ద్వారా చివరికి ఏం తేల్చారంటే…

ఆఫరేషన్లో భాగంగా రాత్రి 9 గంటలకు లేడీ కానిస్టేబుళ్స్ సౌమ్య, సబితతో కలిసి సివిల్ డ్రస్ లో కోజికోడ్ రోడ్లపైకి వచ్చి..బస్టాండ్లు, రైల్వేస్టేషన్, బీచ్ ఏరియాలో  తెల్లవారుజాము ఐదు గంటల వరకు తిరిగారు. రాత్రి 11.40 గంటలకు బస్టాండ్ ఏరియాలో నిలబడి ఉన్న ఆమెను … ఓ ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి అదేపనిగా చూడడమే కాదు . కొన్ని కామెంట్స్ చేశారట.. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకో బైక్ ఆమె వెనకే వచ్చి.. అర్థరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుంది అంటూ ఏవేవో మాట్లాడరట… ఓ ఐదు నిమిషాలు బైక్ తో వెంబడించారట… అక్కడి నుంచి కోచికోడ్ బీచ్ కు వెళ్లిన ఆమెను అర్థరాత్రి సమయంలో ఒంటరిగా ఉండటంతో చాలా మంది అదోలా చూశారట.. కొందరు అయితే దగ్గరకి వచ్చి మరీ గమనించారట..ఎవరై ఉంటుంది..ఎందుకు ఈ టైంలో ఇక్కడుంది..జనరల్ గా అంతరాత్రి ఒక లేడి బయట తిరిగితే ఎక్కువ మంది మగాళ్లు ఒకే ఉద్దేశ్యంతో చూస్తారు..అతి తక్కువమందే ఏదైనా సమస్యతో సూసైడ్ చేసుకోవడానికి వచ్చిందా అనే ఆలోచనతో ఉంటారు….

మొత్తం మీద 8 గంటల సిటీ పర్యటనలో ఓ మహిళ ఒంటరిగా నడిరోడ్డుపై భయంగా నడిచే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. ఉమెన్ సేఫ్టీ చాలా ఘోరంగా ఉందని ఒప్పుకున్నారు డిసిపి.సెక్యూరిటీ పెంచాల్సిన అవసరాన్ని ఉందని అన్నారు.. లేడీ కానిస్టేబుళ్స్   కూడా తమ అనుభవాలను మీడియాకు చెప్పారు. మొత్తంగా మెహరీన్ అండర్ కవర్ ఆపరేషన్ కేరళలో సంచలనం అయ్యింది. ఇప్పటికైనా మహిళల కష్టాలు తెలుసుకున్నారంటూ అభినందనలు చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top