ఆడపిల్ల పుట్టిందని చావగొట్టారు …మనుషులా..మృగాలా.. [VIDEO]

తన మేధస్సుతో మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్న నేటి సమాజంలో…ఆడపిల్లపై వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది.ఆడపిల్ల పుట్టిందని యాసిడ్ దాడి,ఆడపిల్ల పుట్టిందని చెత్తకుప్పలో పారేయడం,ఆడపిల్ల పుడితే భార్యకు విడాకులు ఇవ్వడం ఇలా ఎన్నో కేసులు చూశాం..ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందని తల్లిని గొడ్డును బాదినట్టు బాదారు బాదితురాలి బావ,అతడి స్నేహితుడు….

పెళ్లంటే ప్రతి ఆడపిల్ల ఎన్నో కలలు కంటుంది..పుట్టింటిని వదిలిపెట్టి వచ్చిన ఆడపిల్ల అత్తింట్లో ఎంతో ప్రేమ కోరుకుంటుంది..కానీ ఇక్కడ పరిస్థితి తారుమారుగా ఉంటే ఏంచేస్తుంది…మీనా కశ్యప్,దల్జీత్ సింగ్ దంపతులకు రెండేళ్ల క్రితం పెళ్లి అయ్యింది .పంజాబ్‌లోని పాటియాలాలో  నివాసం ఉంటున్నారు. . .అదనపు కట్నం తీసుకురావాలని వేదిస్తున్న అత్తింటి వారిని కాదని మీనా కశ్యప్ తన భర్త దల్జీత్‌ సింగ్‌ తో కలిసి వేరు కాపురం పెట్టింది.  మీనా ఈ  మధ్యనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అయితే ఇదే సరైన సంధర్బం అని  ఆడపిల్ల పుట్టిందని మీనాను హాకీ స్టిక్స్ తో గొడ్డును బాదినట్టు బాదారు దల్జీత్ సింగ్ అన్న ,అతని  స్నేహితుడు. ఇదంతా ఒక షాపు ముందే జరిగినా అందరూ ఏదో చోద్యం చూసినట్టు చూసారే తప్ప ,ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు..

ఇప్పుడు ఈ వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు…   ఇపుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Comments

comments

Share this post

scroll to top