జ‌నాల‌ను ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్‌ను చేసిన జియో.. ఆ కంపెనీ ఏం చేసిందో తెలుసా..?

ఏప్రిల్ 1 ఫూల్స్ డే వ‌స్తుందంటే చాలు.. ఎవ‌రైనా త‌మ‌కు తెలిసిన వారిని ఫూల్స్‌ని చేసేందుకు సిద్ధం అవుతుంటారు. అలాగే ప‌లు కంపెనీలు, వ్యాపార సంస్థ‌లు కూడా త‌మ వినియోగ‌దారుల‌ను ఫూల్స్ ని చేయ‌డానికి ప‌లు మార్గాల‌ను అనుస‌రిస్తుంటాయి. కొత్త ఉత్ప‌త్తి ఏదో వ‌స్తుంద‌నో, లేదంటే భారీ త‌గ్గింపు ధ‌ర‌కు ఏదైనా ప్రొడ‌క్ట్‌ను అమ్ముతామ‌నో.. ఇలా ర‌క ర‌కాలుగా కంపెనీలు ప్ర‌జ‌లను ఫూల్స్ ను చేస్తాయి. గ‌తంలో చాలా సార్లు అనేక కంపెనీలు ఇలా ఏప్రిల్ 1న జ‌నాల‌ను ఫూల్స్‌ను చేయ‌డాన్ని మ‌నం చూశాం. అయితే ఇప్పుడు తాజాగా టెలికాం సంస్థ జియో కూడా ఇలాగే జ‌నాల‌ను బురిడీ కొట్టించింది. ఇంత‌కీ జియో ఏం చేసిందో తెలుసా..?

మార్చి 29, 30 తేదీల్లో జియో జ్యూస్ పేరిట ఓ పోస్ట్‌ను జియో త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది కదా. దీంతో చాలా మంది జియో బ్యాట‌రీ సేవింగ్ యాప్ వ‌స్తుంద‌ని అనుకున్నారు. కొంద‌రు జియో నుంచి ప‌వ‌ర్ బ్యాంక్ వ‌స్తుంద‌ని ఆశించారు. ఇంకా కొంద‌రైతే జియో జ్యూస్ పేరిట ఏదైనా కొత్త ప్రొడ‌క్ట్ వ‌స్తుంది కాబోలున‌నుకున్నారు. కానీ నిజానికి ఏప్రిల్ 1న అదంతా ఉత్తిదే అని తేలిపోయింది. దీంతో జ‌నాలు ఫూల్స్ అయ్యారు.


ఏప్రిల్ 1వ తేదీన జియో త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో జియో జ్యూస్‌కు చెందిన ఫుల్ వీడియోను పోస్ట్ చేసే స‌రికి అస‌లు విష‌యం ఇదా అని తెలుసుకుని జనాలు తెగ ఎంజాయ్ చేశారు. న‌వ్వుకున్నారు. జియో సిమ్ ను ఫోన్‌లో వేసుకుంటే జియో ట‌వ‌ర్ నుంచి వైర్‌లెస్ రూపంలో విద్యుత్ త‌రంగాలు ఫోన్ కు అంది ఫోన్ చార్జింగ్ అవుతుంద‌ని, దీంతో మీరు మార్గ‌మ‌ధ్య‌లో ఎక్క‌డ ఫోన్ చార్జింగ్ అయిపోయినా అప్పుడు జియో సిమ్‌ను ఫోన్‌లో వేస్తే దాంతో వైర్‌లైస్ ద్వారా ఫోన్ చార్జింగ్ అవుతుంద‌ని ఆ వీడియోలో చూపించారు. దీంతో అది ఉత్త ప్రాంక్ వీడియో అని తెలిసిపోయింది. నిజానికి అస‌లు అలాంటి టెక్నాల‌జీ ఏదీ ప్ర‌స్తుతం లేదు. దీంతో ఓ ద‌శ‌లో ఆ వీడియోను కూడా జ‌నాలు నిజ‌మేన‌ని న‌మ్మారు. కానీ అది సాధ్యం కాద‌ని, జియో ఏప్రిల్ 1 ఫూల్స్ డే సంద‌ర్భంగా ఆ వీడియో రిలీజ్ చేసింద‌ని తెలుసుకుని అంద‌రూ న‌వ్వుకున్నారు. దీంతో ఈ విష‌యం కాస్తా నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

Comments

comments

Share this post

scroll to top