ఆ రాజుకి భిన్నమైన హాబీస్ ఉండేవి..! “వేశ్యలను” ఫోటో తీసేవాడు..! కారణం ఏంటో తెలుసా.?

సెక్స్ వ‌ర్క‌ర్లు.. వేశ్య‌లు.. ఎలా పిలిచినా పురాతన కాలం నుంచి వారిని స‌మాజం చిన్న చూపే చూస్తోంది. కుటుంబ ప‌రిస్థితులు బాగాలేక‌, ఇత‌ర ఏ స‌మ‌స్య‌ల‌తోనైనా స‌త‌మ‌త‌మ‌వుతూ వేరే గ‌త్యంత‌రం లేక ఆ వృత్తిలోకి వెళ్లిన వారు కొంద‌రుంటే, ఇంకా కొంద‌రు బ‌ల‌వంతంగా అందులోకి దింప‌బ‌డ‌తున్నారు. అయితే ఈ వృత్తికి చెందిన వారిని అంద‌రూ చిన్న‌చూపు చూసేవారు కానీ, ప్ర‌తి మ‌నిషిని మనిషిగా ఆదరించి, మాన‌వ‌త‌ను చూపే వారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఈయ‌న కూడా ఒక‌రు, ఈయ‌న పేరు మ‌హారాజా సవాయి రామ్ సింగ్ 2.

మ‌హారాజా రామ్ సింగ్ 2 జైపూర్ రాజు. ఈయ‌న 1835లో జ‌న్మించారు. అయితే అంద‌రు రాజుల్లా కాకుండా ఈయ‌న‌కు హాబీలు భిన్నంగా ఉండేవ‌ట‌. అందులో ఒక‌టి ఫొటోగ్ర‌ఫీ. ఆయ‌న ఫొటోలు తీయ‌డం కోసం అప్ప‌ట్లో లండ‌న్‌కు చెందిన బ్రిటిష్ ఫొటోగ్రాఫ‌ర్ టి.ముర్రే స‌హాయం తీసుకున్నారు. అందుకు గాను ముర్రేను ఏకంగా ఇండియాకు ఆయ‌న ర‌ప్పించారు. ముర్రే ఓ కెమెరాను తీసుకురాగా దాంతో రామ్ సింగ్ ఫొటోలు తీసేవారు. అయితే అలా తీసే ఫొటోల‌ను రామ్ సింగ్ ప్ర‌త్యేక నిర్మించిన త‌స్వీర్ ఖానా అనే ఓ భ‌వ‌నంలో ఉంచే వారు.

రామ్ సింగ్ 2 ఎక్కువ‌గా సామాన్య పౌరులు, వారి జీవ‌న శైలితోపాటు వేశ్య‌ల ఫొటోల‌ను తీసేవారు. ఎందుకంటే అప్ప‌ట్లో వేశ్య‌ల‌ను చాలా చిన్న చూపు చూసేవార‌ట‌. దీంతో వారు మోడ‌ల్స్‌గా ఏమాత్రం త‌క్కువ కారు అనే విష‌యాన్ని చాటి చెప్ప‌డం కోసం రామ్ సింగ్ వారి ఫొటోల‌ను తీసేవారు. అలా రామ్ సింగ్ తీసిన ఫొటోలు ఇప్ప‌టికీ భ‌ద్రంగా ఉన్నాయి. వాటిని మీరు పైన చూడ‌వ‌చ్చు. ఏది ఏమైనా అప్ప‌ట్లో రామ్ సింగ్ ఇలా చేశారంటే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top