ఆకాకరకాయలు…అన్ని రోగాలకు విరుగుడు మంత్రం. క్యాన్సర్ నుండి షుగర్ వ్యాధి వరకు…..!

మీకు  ఆకాకరకాయల గురించి  తెలుసా? కాకరకాయ జాతికే చెందిన వీటిని  కొన్ని ప్రాంతాల్లో  బొంతు కాకరకాయలంటారు.  చూడడానికి కాకరకాయలాగే ఉంటాయి..కానీ పొడుగుగా కాకుండా రౌండ్ గా ఉండి వాటిపై చిన్నచిన్న బొడిపలుంటాయి. వాటిని మన వంటల్లో భాగంగా చేసుకుంటే షుగర్, క్యాన్సర్ , చర్మ వ్యాధులు, ఒబేసిటీ లాంటి అనేక వ్యాధులను ముందుగానే నివారించవొచ్చు.

ఆకాకరకాయలను తినడం వల్ల కలిగే లాభాలు మీకోసం:

  • గర్భిణులకు:   ఆకాకరకాయల్లో  ఫొలేట్‌లు అధికమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడతాయి.
  • షుగర్ వ్యాధిగ్రస్తులకు:  ఆకాకరకాయ  రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
  • క్యాన్సర్ వారికి:  ఆకాకరకాయలో  ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి. తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్‌ కారకాలను నాశనం చేస్తాయి.
  • ఆకాకరకాయలోని విటమిన్‌ ‘సి’ శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది.
  • దీనిలో ఫ్లవనాయిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • దీనిలో లభించే విటమిన్‌ ‘ఎ’ కంటి చూపునకు మేలు చేస్తుంది.
  • మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.
  •  జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
  • స్వల్ప  కెలొరీలుంటాయి కాబట్టి లావు అవుతామనే బెంగే అవసరం లేదు..
  • ఫైబర్ , విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి.

(ఇలాంటి హెల్త్ టిప్స్  డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటే మా వాట్సాప్ నెండర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి)

Comments

comments

Share this post

scroll to top