మీలో ఉన్న మృగాన్ని చంపేయండి. ఆ Gang రేపు?

మీ అందరిలో ఉన్న పశువు మీతో ఆ పనిచేయించింది. దాన్ని మీలో బతకనీయకండి. మీలోని మృగాన్ని చంపేయండి, ఎందకంటే మనుషుల్ని ఎదురించి బతికే శక్తి మా అమ్మాయిలకు ఉంది, కానీ మృగాల్ని ఎదిరించి బతికే శక్తి మాకు లేదు. ఈ బరువైన పదాలు చాలు…. సమాజంలో  అమ్మాయిలకున్న రక్షణ ఏ పాటిదో…!? ఇదే లైన్ ను స్టోరీగా తీసుకొని అధ్భుతమైన సందేశంతో  తెరకెక్కిన లఘుచిత్రమే ఆ గ్యాంగ్ రేపు?…. ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న అమ్మాయిని నలుగురు అబ్బాయిలు బలవంతంగా ఎత్తుకొని రావడం….ఆమెను అనుభవించాలని చూడడం…ఆ అమ్మాయి తన పరిస్థితిని చెప్పడం…వారిలో మార్పు రావడం….రేప్ చేయడానికి ప్రయత్నించిన వాడే అన్నగా ఉంటానని చెప్పడం….. ఇలా ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రతి సన్నివేశం మనసుల్ని కట్టిపడేస్తుంది, వాస్తవాన్ని కనుల ముందుంచుతుంది.

టైటిల్, మొదటగా వచ్చే సీన్లను చూస్తుంటే ఏదో అడల్ట్ మూవీలే… అని తీసిపారేసే లోపు…అసలైన పాయింట్ తో ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకు ప్రశ్నార్థకమైన రక్షణను, తాగిన మత్తులో రాక్షసులుగా ప్రవర్తిస్తున్న అబ్బాయిలను,మనీ, సెక్స్ లకు ఆకర్షితులై పలచనవుతున్న కుటుంబ సంబంధాలను అద్బుతంగా తెరకెక్కిచాడు దర్శకుడు. ఇంతటి సందేశాత్మక చిత్రాన్ని తీసిన  దర్శకుడికి, నటీనటులకు  అభినందనలు.. మీరు ఈ షార్టీ చూడండి…మీలో ఏ మూలనో ఉన్న మృగాన్ని నిద్రలేపి మరీ పారద్రోలండి.

Watch AA Gang Repu? :

Comments

comments

Share this post

scroll to top