ఆ డైరెక్టర్ నన్ను నైటీలో చూడాలనుకున్నాడు అంటూ సంచలన కామెంట్స్ చేసిన నటి

టాలివుడ్లో భగ్గుమన్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలకు పాకింది..సినిపరిశ్రమలోని నటీమణులు  రోజుకు ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటికి చెప్పుకుంటున్నారు… తాజాగా బాలీవుడ్ నటి మహి గిల్ కాస్టింగ్ కౌచ్ గురించి,తాను ఏ పరిస్థితిలు ఎదుర్కొన్నది చెప్పుకొచ్చింది.నన్ను ఫలానా డైరక్టర్ నైటీలో చూడాలని అన్నాడని డైరెక్టర్లు,నిర్మాతల గురించి సంచలన కామెంట్స్ చేసింది.

“సినిమా అవకాశాల కోసం ముంబై వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు మంచి వాళ్లో.. ఎవరు చెడ్డవాళ్లో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ముంబైలోని సినీ పరిశ్రమలో ఉన్న మాటలు వినాల్సి వచ్చేది. మంచి వ్యక్తులను ఎవరని గుర్తించడం..అలాంటి వారిని కలవడం చాలా కష్టమయ్యేది” అని తన గత అనుభవాలను ఇటీవల మీడియా ముందు బయటపెట్టింది మహి గిల్.బాలివుడ్ భామ మహి గిల్ చండీగర్ లో పుట్టి పెరిగింది.  మొదట పంజాబీలో నటిగా పరిచయమయిన మహి 2009లో దేవ్ డీ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది..ఇప్పటివరకూ పాతిక పైగా సినిమాలు చేసిన  మహి గిల్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను చెప్పింది.

“పడక గదికి వస్తేనే వేషాలు ఇస్తామని చాలా మంది డైరెక్టర్లు నా కెరీర్ తొలినాళ్లలో వేధించారు. చాలా సార్లు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను.  ఆ డైరెక్టర్ల పేర్లు కూడా నాకు గుర్తుకు లేవు. పరిశ్రమలో ఎక్కువ మంది ఇడియెట్స్ ఉంటారు” అని దర్శకనిర్మాతల గురించి ఆరోపించింది. “ఓ సారి నేను ఓ డైరెక్టర్‌ను కలిశాను. అప్పుడు నేను సల్వార్ సూట్లో అతడిని వెళ్లాను. అందుకు నీవు ఇలా సల్వార్ సూట్‌లో వస్తే ఎవరూ వేషాలు ఇవ్వరు అని అన్నాడు. మరో డైరెక్టర్‌ “నిన్ను నైటీలో చూడాలనుకొంటున్నాను” అన్నాడని అప్పటి తనెదుర్కొన్న పరిస్థితిలను వివరించింది..

Comments

comments

Share this post

scroll to top