సార్ రక్షించండీ.. అంటూ రైలు లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి ట్వీట్ కు వెంటనే స్పందించిన రైల్వే మంత్రి.

నమ్రత మహాజన్:  ప్లీజ్.. ప్లీజ్ నన్ను రక్షించండి. 18030 రైలులో షెగాన్ వద్ద ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను. ఒకడు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతడిపై నాకు అనుమానంగా వుంది.
మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్: మీరు 182 సంప్రదించండి. మీరు చెప్పే డీటెయిల్స్  తో కనుక్కోవడం కొంచెం ఇబ్బంది. మీ పి. ఎన్. ఆర్ నెంబర్ ను  పంపండి.
నమ్రత మహాజన్: PNR:6446866270,TRAIN:18030,DOJ:26-11-15,SL,AK-LTT,Dep:18:05, NAMRATA MAHAJAN,S13 67
మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్: మీరు కంగారు పడకండి. మా సిబ్బంది వెంటనే మీ వద్దకు వస్తారు.
నమ్రత మహాజన్: వెంటనే వచ్చి రక్షించినందుకు కృతఙ్ఞతలు సార్..

29-1443468113-sureshprabhu

Capture

ఈ కన్వర్జేషన్ ఏదో సినిమాలో జరిగింది అనుకునేరు. ముంబైలో ప్రయాణిస్తున్న నమ్రత మహాజన్ అనే మహిళకు షెగాన్  ప్రాంత సమీపంలో ఇటీవలే జరిగిన సంఘటన. రైల్లో ప్రయాణిస్తున్న నమ్రత తన పక్కనే ఉన్న వ్యక్తి చేష్టలు చూస్తూ భయపడి, అతడి మీద అనుమానంతో ఏకంగా రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభుకు ట్వీట్ చేసింది. వెంటనే మినిస్ట్రీ రైల్వే వారు, నెక్స్ట్ స్టేషన్ లోని పోలీసులకు ఈ విషయం చెప్పగా, వెంటనే అక్కడికి పోలీసులు వాలిపోయారు.ఆమె పక్కన కూర్చున్న అతడు వెయిటింగ్ లిస్టు లో వుండడంతో పక్క భోగీలో కూర్చోబెట్టారు.

ఓ మహిళ చేసిన ట్విట్ కు ఇంత ఫాస్ట్ గా స్పందించిన రైల్వే మినిష్టర్ సురేష్ ప్రభును,  మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ను  సోషల్ మీడియా అంతా పొగడ్తలతో ముంచెత్తుతుంది.

Comments

comments

Share this post

scroll to top