టైమ్ కు స్కూల్ కు చేరడం కోసం అడ్డంగా ఉన్న నదిని రోజూ ఈదుకుంటూ వెళ్లే టీచర్.

గురుదేవో భవ అని  ఎందుకంటారు అనే ప్రశ్న తలెత్తినప్పుడు…ఈ టీచర్ ను చూపిస్తే సరిపోతుందనుకుంటా… సమయానికి స్కూల్ కు చేరడం కోసం అడ్డంగా ఉన్న నదిని ఈది,  నదికి అవతలి వైపున్న స్కూల్ కు చేరుకుంటాడీ టీచర్. ఇతని పేరు మాలిక్.. కేరళలోని  పుడింజట్టుమర్రి లోని ప్రైమరీ స్కూల్ లో 1992 నుండి టీచర్ గా పనిచేస్తున్నాడు. అతడు ఉన్న ప్రాంతం నుండి స్కూల్ కు వెళ్లాలంటే రోజూ రెండు బస్సులు మారి స్కూల్ కు చేరాలి, దీని కోసం రోజూ 3 గంటల పాటు సమయం పడుతుంది. దీంతో ఎంత ఎర్లీగా బయలుదేరినా…. స్కూల్ కు లేట్ అయిపోతుండేది.

తన వల్ల విద్యార్థులు నష్టపోవొద్దు అని ఫిక్స్ అయిన ఆ టీచర్ … పెద్ద రిస్క్ కే పూనుకున్నాడు. వారి ఊరికి,  స్కూల్ కు మద్య ఉన్న నదిని ఈది స్కూల్ కు వెళ్లాలని అనుకున్నాడు..  అనుకున్నదే తడవుగా ప్రతి రోజూ 12 నిమిషాల పాటు కదలుండిపుజా అనే నదిని ఈది స్కూల్ కు చేరుకునే వాడు ఆ టీచర్.

teacher2

మరో విషయం ఏంటంటే అతడు నదిలో ఈదుకుంటూ కనిపించాడంటే….టైమ్ 9 అయ్యిందని గ్రామస్థులకు తెలిసిపోతోంది. అంతే కాదు ఇతడు తన జీతం లో చాలా వరకు స్కూల్ లోని పేద పిల్లలకు ఇచ్చేస్తాడు. తను స్కూల్ కు వెళ్లేటప్పుడు ఓ జత బట్టలు ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకొని, నదిలో ఈదుకుంటూ అవతలి గట్టుకు వెళతాడు, వెళ్ళగానే అక్కడ బట్టలు చేంజ్ చేసుకొని అటు నుండి స్కూల్ కు వెళతాడు.. ఒక్కరోజు కూడా టైం తప్పించలేదు ఈ టీచర్..

 

Comments

comments

Share this post

One Reply to “టైమ్ కు స్కూల్ కు చేరడం కోసం అడ్డంగా ఉన్న నదిని రోజూ ఈదుకుంటూ వెళ్లే టీచర్.”

  1. nagaraju says:

    Hatts of to Mr. Malik

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top